వ్యక్తులు మారడం వల్లనే మద్యపాననిషేధం సాధ్యమవుతుందని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. 75 వసంతాల స్వాతంత్రోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులోని వీవీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో.. మత్తు పానీయాల నిరోధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు, పానీయాలకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి లక్ష్యం పైనే గురి ఉంచాలన్నారు. మద్యం కారణంగా పేద కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మానుకోవాలి అనుకునే వారి కోసం ప్రభుత్వం 25 డీ ఎడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.
ఇదీ చదవండి: గుంటూరు నగర మేయర్గా కావటి మనోహర్ నాయుడు