ETV Bharat / state

గుంటూరులో కొవిడ్​పై అవగాహనా ర్యాలీ - awareness rally on covid news

రెండవ దశ కరోనా వ్యాప్తి పెరిగిపోతుండటంతో ప్రజలను చైతన్యపరచటానికి గుంటూరులో అవగాహనా ర్యాలీ చేపట్టారు. నేటి నుంచి 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిసామని నగర మేయర్​ కావటి మనోహర్ నాయుడు తెలిపారు.

awareness rally
అవగాహనా ర్యాలీ
author img

By

Published : Mar 25, 2021, 3:29 PM IST

కొవిడ్ బారిన పడకుండా ప్రజలు తమను తాము కాపాడుకోవాలంటూ అవగాహనా ర్యాలీ నిర్వహించారు. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి నగరపాలెం మూడు బొమ్మల సెంటర్ కూడలి వరకు ర్యాలీ కొనసాగింది. ప్రజలను చైతన్యపరచటానికి నేటి నుంచి 15 రోజుల పాటు పలు కార్యక్రమాలు చేపట్టినట్లు నగర మేయర్​ కావటి మనోహర్ నాయుడు తెలిపారు.

కరోనాతో సహజీవనం తప్పదని సీఎం జగన్ వ్యాఖ్యానిస్తే.. కొన్ని రాజకీయ పార్టీలు దానిని రాద్ధాంతం చేశాయని మేయర్​ అన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన విధంగానే నేటి పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు. భౌతిక దూరం, మాస్క్​లు ధరించడం వల్ల కరోనా నుండి రక్షణ పొందవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, మహమ్మద్ ముస్తఫా, కమిషనర్ చల్లా అనురాధ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కరోనాతో తెనాలి పురపాలక సంఘం ఉద్యోగిని మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.