కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ పేరిట ఆంక్షలు అమలు చేస్తున్నా.. కొందరు మాత్రం పట్టించుకోవడం లేదు. కారణం లేకున్నా రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వారికి అవగాహన కలిగించేందుకు గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు వినూత్నంగా ప్రయత్నించారు. పట్టణంలోని గాంధీ చౌక్‌లో.. వైరస్ బొమ్మతో కరోనా ప్రభావాన్ని వివరిస్తున్నారు. ఓ వ్యక్తికి కరోనా వేషధారణ చేయించి రిక్షాపై ప్రచారం చేయిస్తున్నారు. ప్రజలు ఈ మహమ్మారిపై అవగాహన పెంచుకుని.. లాక్ డౌన్ అమలుకు సహకరించాలని.. ఇళ్లకే పరిమితం కావాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: