తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 'ఈనాడు' ఆటో షో ప్రారంభమైంది. ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఆటో షో ఇవాళ, రేపు ఉంటుంది. రవాణాశాఖ ఉప కమిషనర్ ప్రతాప్, ఆంద్రా బ్యాంక్ డీజీఎం రామ్మెహనరావు, ఎస్బీఐ డీజీఎం రంగప్రసాద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ రకాల బైక్లు, స్కూటర్లు, కమర్షియల్ వాహనాలు ఈ షోలో ప్రదర్శించారు. ఈ ఆటో షో ప్రాధాన్యతను 'ఈనాడు' రాజమహేంద్రవరం యూనిట్ ఇంఛార్జి చంద్రశేఖర్ ప్రసాద్ వివరించారు.
ఇదీ చదవండి:
గుంటూరులో రెండో రాష్ట్ర స్థాయి మున్సిపల్ క్రీడా పోటీలు ప్రారంభం