ETV Bharat / state

ఆస్తికోసం తమ్ముడిపై దాడిచేసిన అన్నలు - crime news in guntur dst pedanandipadu

ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాయి. రక్తసంబంధం అనే విషయం కూడా మరచి తమ్ముడి పై ఇద్దరు అన్నలు బ్లేడులతో దాడి చేసిన సంఘటన గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగింది.

attack on younger brother by two elder brothers in guntur dst pedananipad

author img

By

Published : Jul 12, 2020, 4:48 PM IST

గుంటూరు జిల్లా పెదనందిపాడుకి చెందిన శివశంకర్ గుప్తా, శేషగిరిరావు, శ్రీనివాస గుప్తా ముగ్గురు అన్నదమ్ములు. వీరు గత కొన్నేళ్లుగా బియ్యం దుకాణం నడుపుకుంటున్నారు. వీరి మధ్య ఆస్తి కోసం ఎప్పటి నుంచే వివాదం జరుగుతోంది.

శనివారం రాత్రి శివశంకర్ గుప్తా, అతని కుమారుడు నారాయణ, మరో సోదరుడు శేషగిరిరావులు కలసి తమ్ముడు శ్రీనివాస గుప్తా, అతని కొడుకు చక్రవర్తిలపై బ్లేడులతో దాడి చేశారు. బ్లేడుతో పొట్టపై దాడి చేయటంతో శ్రీనివాస గుప్తా , అతని కుమారుడు చక్రవర్తిలకు తీవ్ర గాయాలయాయ్యి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఎస్సై జయకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి

భార్యను ఇంట్లో బంధించి నరకం చూపిన భర్త

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.