గుంటూరు జిల్లా నూజండ్ల మండలం పాత ఉప్పలపాడు గ్రామంలోని ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ గ్రామ వాలంటీర్‌పై కొందరు దాడి చేశారు. గ్రామానికి చెందిన నంబుల నాగరాజు (25) వాలంటీర్‌గా పని చేసేవాడు. అదే గ్రామానికి చెందిన ఓ యువతి.. తనను నాగరాజు వేధిస్తున్నాడంటూ కుటుంబ సభ్యులకు చెప్పింది. కోపోద్రిక్తులైన యువతి సోదరులు అతనిపై దాడి చేశారు.
తీవ్ర గాయాలపాలైన నాగరాజును చికిత్స నిమిత్తం తొలుత వినుకొండ పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట జీబీఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. నాగరాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: