తెలుగు సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను వివరించే పండగల్లో.. అట్లతద్ది(atlathaddi) ఒకటి. గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని లంకెవానిదిబ్బలో పండుగలను తెలుగు సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఆడపడుచుల పండుగగా చెప్పుకునే.. అట్లతద్ది పండుగను నాలుగేళ్లుగా ఊరు, వాడా అంతా కలిసి ఒకేచోట నిర్వహించుకుంటున్నారు.
గ్రామంలోని మహిళలు, యువతులు భారీగా ఉయ్యాలలు ఏర్పాటు చేశారు. ఇంటి వద్దే గౌరీ పూజ చేసుకుని ఆడపడుచులు అందరూ ఒకేచోటకు చేరుకుని ఉయ్యాలలు ఊగుతూ ఉత్సాహంతో పండుగను జరుపుకున్నారు. గ్రామ సర్పంచ్ పాపారావు.. ఊరిలోని ప్రతి మహిళకు చీరలు, సారె పంచి పండగ శుభాకాంక్షలు తెలిపారు.
ఆడపడుచులు సంబరంగా జరుపుకునే ఈ పండుగను తిలకించేందుకు..ఇతర గ్రామాల నుంచి సైతం మహిళలు పెద్ద ఎత్తున వచ్చి తిలకిస్తుంటారని గ్రామస్థులు తెలిపారు. అట్లతద్దిని ఇంత ఘనంగా ఎక్కడా చేయరని మహిళలంటున్నారు.
ఇదీ చదవండి: