గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ప్రముఖ అసిస్ట్ సేవా సంస్థ 25 లక్షల రూపాయల విలువైన 50 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ లను గుంటూరులోని సెయింట్ జోసెఫ్ ఆసుపత్రికి అందజేసింది. జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. అసిస్ట్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను జేసీ కొనియాడారు.
ప్రస్తుతం కరోనా కష్టకాలంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు రోగులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు వడ్లమాని రవి, డైరెక్టర్ జాష్టి రంగారావు, అసోసియేట్ డైరెక్టర్ వియాని, ఆసుపత్రి సిబ్బంది.. పాల్గొన్నారు.
ఇదీ చదవండీ..తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు