ETV Bharat / state

పర్వతారోహకురాలు ఆశా మాలవ్యను అభినందించిన మంత్రి రోజా - Asha Malaviya met Minister Roja at secretariat

Asha Malaviya met Minister Roja: మహిళా భద్రత, సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో సైకిల్​పై దేశయాత్ర నిర్వహిస్తున్న ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్యను మంత్రి రోజా అభినందించారు. సచివాలయంలో మంత్రి రోజాను పర్వతారోహకురాలు ఆశామాలవ్య మర్యాదపూర్వకంగా కలిసి.. దేశవ్యాప్తంగా తాను చేస్తున్న సైకిల్ యాత్ర లక్ష్యాన్నిగురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం అందించేందుకు సిద్ధమని రోజా భరోసా ఇచ్చారు.

Asha Malaviya met Minister Roja
Asha Malaviya met Minister Roja
author img

By

Published : Feb 8, 2023, 10:00 PM IST

Asha Malaviya met Minister Roja: మహిళా భద్రత, సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో సైకిల్​పై దేశయాత్ర నిర్వహిస్తున్న ప్రముఖ పర్వతారోహకురాలు ఆశా మాలవ్యను రాష్ట్ర పర్యాటక, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా అభినందించారు. ఆమె లక్ష్యం నెరవేరాలని రోజా ఆకాంక్షించారు. సచివాలయంలో మంత్రి రోజాను పర్వతారోహకురాలు ఆశామాలవ్య మర్యాదపూర్వకంగా కలిశారు.

దేశవ్యాప్తంగా సైకిల్​పై తాను చేస్తున్న సైకిల్ యాత్ర లక్ష్యాన్ని మంత్రి రోజాకు వివరించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్‌ జిల్లా నతారామ్‌ గ్రామానికి చెందిన జాతీయ క్రీడాకారిణి అని, సైకిల్‌పై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం కలిపి 25,000 కిలోమీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు.

నవంబర్‌ 1న భోపాల్‌లో సైకిల్ యాత్ర ప్రారంభించి.. ఇప్పటివరకు ఏపీ సహా 8 రాష్ట్రాల్లో 8 వేల కిలోమీటర్లకు పైగా సైకిల్ యాత్ర పూర్తిచేయడం జరిగిందని.. ఆమె మంత్రికి వివరించారు. ఈ సందర్బంగా బొబ్బిలి వీణను ఆశా మాలవ్యకు మంత్రి బహూకరించి శాలువాతో సత్కరించారు. ఎటువంటి అవసరం ఉన్నా సరే అన్ని విధాలుగా సహకరించేందుకు తాను సిద్దంగా ఉన్నానని మంత్రి ఆమెకు భరోసా ఇచ్చారు.

పర్వతారోహకురాలు ఆశా మాలవ్యకు మంత్రి రోజా గిఫ్ట్​..

మధ్యప్రదేశ్​కు చెందిన ఆశా మాలవ్య అనే అమ్మాయి.. తను సైక్లింగ్​ మీద ఈ రోజు దాదాపుగా 8555 కిలోమీటర్లు పూర్తిచేసుకుని ఆంధ్రప్రదేశ్​లో అడుగు పెట్టడం జరిగింది. మిగతా రాష్ట్రాల వారు కూడా ఆంధ్రప్రదేశ్​లా ఇక్కడ ఉన్న చట్టాలు తీసుకువచ్చి.. మహిళా సాధికారత కోసం ఆలోచిస్తే భారతదేశం అంతా కూడా బాగుంటుంది. అని ఆశా మాలవ్య చెప్పడం.. ఒక తెలుగింటి ఆడపిల్లగా నేను గర్వపడుతున్నాను.- : ఆర్.కే.రోజా, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.