ETV Bharat / state

తాజా మిఠాయిలకు భరోసా! - ఆహార భద్రత, ప్రమాణాల యంత్రాంగం వార్తలు

బేకరీలలో మిఠాయిలను చూసి అబ్బా తింటే ఎంతో బాగుంటుందో అనుకుంటాం. తీరా దుకాణానికి వెళ్లి చూస్తే.. అవి ఎప్పుడో చేశారో అని వాటిని కొనకుండానే ఇంటికి ముఖం పడుతాం..! ఇప్పటినుంచి మనం హ్యాపీగా కొనుక్కునే తినొచ్చు. ఎలా అంటారా..! స్వీట్లు, వాటి తయారీ, బెస్ట్‌బిఫోర్‌ డేట్‌ ముద్రణ తప్పనిసరి చేయనున్నారు ఆహార భద్రత, ప్రమాణాల యంత్రాంగం. అక్టోబరు ఒకటి నుంచి అమలుకు ఆదేశాలకు కార్యచరణ రూపొందించనున్నారు.

Arrangements of authorities for food security
మిఠాయిలు
author img

By

Published : Sep 29, 2020, 6:01 PM IST

వందల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న మిఠాయిలు తాజావో.. రోజుల తరబడి నిల్వ ఉన్నవో తెలియదు. ఎందుకంటే వాటి వివరాలు తెలిసేలా బోర్డులు సైతం ప్రదర్శించడం లేదు. ఇలా ప్రదర్శించాలని ఇప్పటి వరకు సంబంధిత స్వీటు షాపు నిర్వాహకులకు యంత్రాంగం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. ఇదే అదనుగా రోజుల తరబడి నిల్వ ఉన్నవి సైతం కొందరు వ్యాపారులు అంటగట్టేస్తున్నారు. ఇక మీదట ఆహార భద్రత, ప్రమాణాల యంత్రాంగం కఠినంగా వ్యవహరించబోతోంది.

అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఆంక్షల చట్రాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇది వినియోగదారులకు తాజా స్వీట్లు అందేలా భరోసాను ఇవ్వనుంది. గుంటూరు, తెనాలి, నరసరావుపేట డివిజన్లలో 60 తయారీ కార్ఖానాలు ఉన్నాయి. మరో 600 దాకా రిటైల్‌ మిఠాయి దుకాణాలు ఉన్నాయి. వీరంతా ఫుడ్‌ లైసెన్సులు పొంది వ్యాపారం చేస్తున్నారు.

వీటిలో అక్టోబరు ఒకటో తేదీ నుంచి ప్రతి స్వీటు తయారీ తేదీ, దాన్ని ఎన్ని రోజుల్లోపు తినాలో సూచిస్తూ బోర్డులు పెట్టాలని ఆహార కల్తీ నియంత్రణ విభాగం జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ బోర్డులు పెడుతున్నారా లేదా అని ఆకస్మిక తనిఖీలు చేసి తెలుసుకునేలా సన్నాహాలు చేస్తోంది. బోర్డులు పెట్టకుంటే తమకు ఫిర్యాదు చేయాలని యంత్రాంగర పేర్కొంది.

ఏ తీపి పదార్థం ఎన్ని రోజులు ఉంటుందంటే..

సంప్రదాయబద్ధంగా పాలు, శనగ పిండితో తయారు చేసిన తీపి పదార్థాలను ఎన్ని రోజుల్లోపు తినొచ్చో ఆహార భద్రత, ప్రమాణాలశాఖ ఓ జీవిత కాలాన్ని నిర్దేశించింది.

  • అతి తక్కువ జీవిత కాలం అంటే అదే రోజు తినాల్సిన పదార్థాలు అంటే కలాఖండ్‌ (బటర్‌ స్కాచ్‌, చాక్లెట్‌ కలాఖండ్‌ తదితరాలు)
  • తక్కువ జీవితకాలం అంటే రెండు రోజుల్లో తినాల్సినవి ఉదా: పాల పదార్థాలతో తయారు చేసిన బెంగాలీ స్వీట్స్‌, రసగుల్ల, రసమలై, బాదం మిల్క్‌...
  • మధ్యస్థ జీవితకాలం అంటే నాలుగు రోజుల్లోపు తినాల్సినవి ఉదా: లడ్డూ, కోయస్వీట్స్‌, మిల్క్‌ కేకు, బూందీ లడ్డూ, కోకోనట్‌ బర్ఫీ, కోయ బాదం
  • ఏడు రోజుల వరకు నిల్వ ఉండేవి నేతితో తయారు చేసిన స్వీట్లు, డ్రైఫ్రూట్స్‌, హల్వా, డ్రైఫ్రూట్‌ లడ్డూ, అంజీర్‌ కిక్‌, కాజు లడ్డూ తదితరాలు
  • అతి ఎక్కువ జీవితకాలం అంటే.. సుమారు 30 రోజుల వరకు ఉండే ఆటా లడ్డూ, చనా లడ్డూ, చనా బర్ఫీ, చిక్కీలు

అక్టోబరు ఒకటి నుంచి అమల్లోకి..

ఇక మీదట స్వీట్ల తయారీదారులు, విక్రేతలు ప్రతి ఒక్కరూ వాటిని ఎప్పుడు తయారు చేశారు? ఎప్పటిలోగా వాటిని తినాలో తెలియజేస్తూ బోర్డులు పెట్టాలి. అలా పెడుతున్నారా లేదా అని ఆకస్మిక తనిఖీలు చేసి తెలుసుకుంటాం. వీరంతా వార్షిక రిటర్న్‌ దాఖలు చేయాలి. మే 31 లోపు ఫారం-డీలో వాటిని సమర్పించాలి. ఆలస్యమైతే రోజుకు వంద చొప్పున అపరాధ రుసుం విధిస్తారు. ఎవరైనా బోర్డులు పెట్టలేదని తేలితే సంబంధిత షాపు నిర్వాహకునికి రూ.2 లక్షల దాకా అపరాధ రుసుం విధిస్తాం. నెలకు ఎన్ని స్వీట్లు తయారు చేశారు. ఎన్ని కిలోలు విక్రయించారో వాటి వివరాలు తెలియజేయాలి.

- గౌస్‌మొహియుద్దీన్‌, అసిస్టెంట్‌ ఫుడ్‌కంట్రోలర్‌, గుంటూరు

ఫిర్యాదులకు..

అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌... 98484 70969, గెజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, డివిజన్‌-1 94947 69742, ఫుడ్‌ సేఫ్టీ అధికారి, డివిజన్‌-2 98851 37043, పుడ్‌ సేఫ్టీ అధికారి, డివిజన్‌-3 95507 72265 లకు ఫోన్ చేయాలని అధికారులు తెలియజేశారు.

ఇదీ చూడండి:

అక్టోబర్​ నెలలో తిరుమలలో జరిగే ఉత్సవాల వివరాలు ఇవే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.