సీఎస్‌తో భేటీ అయిన భారత సైన్య మేజర్ జనరల్ ఆర్కేసింగ్
భారత సైన్యానికి చెందిన మేజర్ జనరల్ ఆర్కే సింగ్... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో భేటీ అయ్యారు. సైన్యాధికారి... సీఎస్‌తో సచివాలయంలో సమావేశమయ్యారు. ఆంధ్రా సబ్ ఏరియాకు ఇంఛార్జిగా తనను భారత సైన్యం నియమించిందని... ఈ ప్రాంతంలో సైన్యానికి సంబంధించిన అన్ని అంశాలను తాను పర్యవేక్షిస్తానని ఆర్కే సింగ్... సీఎస్‌కు వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత నూతనంగా ఏర్పాటైన ఆంధ్రా సబ్ ఏరియాకు సంబంధించిన అంశాలపై ఇరువురు చర్చించారు.
సీఎస్‌తో భేటీ అయిన భారత సైన్య మేజర్ జనరల్ ఆర్కేసింగ్