గుంటూరు జిల్లా రేపల్లె మండలం కైతేపల్లి గ్రామానికి చెందిన షేక్ సర్వర్‌తో సహనాజ్ అనే మహిళకు 2006 వివాహం జరిగింది. సర్వర్‌కు ఆర్మీలో ఉద్యోగమని కట్నకానుకులు ఇచ్చి వివాహం ఘనంగా చేశారు. వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్న సర్వర్.... 20018లో స్వగ్రామంలో మరొక మహిళను వివాహం చేసుకున్నాడని బాధితురాలు వాపోయింది. ఈ విషయమై రేపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాను, తన పిల్లలకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి: ప్రియుడితో కలిసి భర్తను అంతమెుందించిన భార్య..!