ETV Bharat / state

శుభవార్త.. సంక్రాంతి పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Special buses for Sankranti: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జనవరి 6 నుంచి 18వ తేదీ వరకు పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీ వసూలు చేయకూడదని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ బస్సుల్లో వసూలు చేసే చార్జీలే తీసుకోవాలని ఆర్టీసీ ఆదేశాలిచ్చింది.

ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
APSRTC SPL BUSSES
author img

By

Published : Dec 14, 2022, 9:16 PM IST

Special buses for Sankranti: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జనవరి 6 నుంచి 18వ తేదీ వరకు పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఈసారి ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీ వసూలు చేయకూడదని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ బస్సుల్లో వసూలు చేసే చార్జీలే తీసుకోవాలని ఆర్టీసీ ఆదేశాలిచ్చింది. పండుగ రద్దీ దృష్ట్యా హైదరాబాద్ సహా చెన్నై, కోల్​కతా, ముంబై తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రద్దీ దృష్ట్యా విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెయ్యి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి హైదరాబాద్​కు అధిక బస్సులు ఏర్పాటు చేసింది. వీటితో పాటు కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని అన్ని జిల్లాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు కృష్ణా జిల్లా ఆర్​ఎం యేసుదానం తెలిపారు. ప్రత్యేక బస్సుల్లోనూ ముందస్తుగా టికెట్ రిజర్వేషన్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ఎపీఎస్ ఆర్టీసీ వెబ్​సైట్, టికెట్ బుకింగ్ కేంద్రాల్లో ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.