ETV Bharat / state

మహాశివరాత్రికి సర్వం సిద్ధం.. భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు - ఇసుక శిల్పం

Arrangements for Maha Shivratri: మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు శైవ క్షేత్రాలకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులన్నీ సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆర్టీసీ ఎండీ తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని శివాలయాలు.. మహా శివరాత్రికి సర్వాంగ సుందరంగా సిద్ధం అయ్యాయి.

rtc
ఆర్టీసీ
author img

By

Published : Feb 17, 2023, 9:02 PM IST

APSRTC arranged special buses for Maha Shivratri: మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు శైవ క్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాలనుంచి 3800 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. కోటప్పకొండకు 675 బస్సులు, శ్రీశైలంకు 650 బస్సులు, కడప జిల్లాలోని పొలతలకు 200 బస్సులు, పట్టిసీమకు 100 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బస్సులన్నీ సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడుస్తాయన్నారు.

రాష్ట్రంలోని 101 శైవ క్షేత్రాలకు 25 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసినట్లు తెలిపిన ఎండీ.. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా శైవ క్షేత్రాల వద్ద అన్ని సౌకర్యాలతో తాత్కాలిక బస్సు స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఘాట్ రోడ్డులలో నైపుణ్యం కల్గిన డ్రైవర్లతో బస్సుల తిప్పే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Arrangements for Maha Shivratri in Bapatla district: బాపట్ల జిల్లా రేపల్లె ప్రాంతంలోని ప్రసిద్ది చెందిన శైవ క్షేత్రాలు మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబయ్యాయి. ఇప్పటికే అర్వపల్లి, గోవాడ, మోర్తోటలోని ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. గోవాడలోని బాల కోటేశ్వరస్వామి,అర్వపల్లిలోని శివాలయాలలో భక్తులకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వికలాంగులకు ప్రత్యేక బారికేడ్లు పెట్టారు. జిల్లాలోనే ప్రసిద్ది చెందిన గోవాడ శైవక్షేత్రంలో మహా శివరాత్రి ఉత్సవాలు ఐదు రోజులు జరగనున్నట్లు జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పానకాలరావు తెలిపారు. సుమారు 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు వివరించారు. భక్తులు అందరూ స్వామివారిని దర్శించుకుని.. తీర్థ ప్రసాదాలు తీసుకువెళ్లాలని కోరారు.

Sand Sculpture : మహాశివరాత్రిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ తన కుమార్తెలతో కలిసి మహాదేవుని సైకత శిల్పాన్ని రూపొందించారు. సర్వం శివమయం అనే నినాదంతో క్షీర సాగర మథనంలో హలాహలం సేవిస్తున్న మహాదేవుని రూపాన్ని తీర్చిదిద్దారు. సుమారు 10 గంటల శ్రమించి మహా దేవుని రూపాన్ని తీర్చిదిద్ది శివుడిపై తన భక్తిని చాటుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.