ETV Bharat / state

Group 1 Mains Results: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల.. ఇంటర్వ్యూలు ఎప్పుడంటే

Group 1 Mains Results: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచింది.

గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు
Group 1 Mains Results
author img

By

Published : Jul 14, 2023, 8:00 PM IST

Updated : Jul 14, 2023, 10:06 PM IST

Group 1 Mains Results: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఎగ్జామ్ ఫలితాలు విడుదలయ్యాయి. జూన్‌ 3 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 5,028 మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. తాజాగా ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన అధికారులు.. మొత్తం 111 గ్రూప్‌ 1 ఉద్యోగాలకు గాను 259 మందిని ఇంటర్వ్యూలకు సెలక్ట్ చేసినట్టు తెలిపారు. వీరిలో 39 మందిని స్పోర్ట్స్‌ కేటగిరీలో ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. ఎంపికైన వారికి ఆగస్టు 2వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 27 నుంచి ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచారు. www.psc.ap.gov.in వెబ్‌సైట్‌లో ఫలితాలను వెల్లడించారు.

ఏపీ పీజీసెట్‌, ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల..

APPGCET 2023 Results: ఆంధ్రప్రదేశ్‌లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీసెట్‌ 2023, బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్‌ 2023 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాద్‌ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. జూన్‌ 6 నుంచి జూన్‌ 10 వరకు ఏపీ పీజీసెట్‌, జూన్‌ 14న ఎడ్‌సెట్‌ పరీక్షలను ఆంధ్రాయూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన విషయం తెలిసిందే.

ఏపీ పీజీసెట్‌ పరీక్షకు 30,156 మంది దరఖాస్తు చేసుకోగా.. 26,799మంది హాజరయ్యారు. వీరిలో 22,858 మంది(85.33శాతం) ఉత్తీర్ణత సాధించారని వీసీ ప్రసాద్‌ రెడ్డి తెలిపారు. ఈ ఫలితాల్లో మహిళలు 85.33%; పురుషుల విభాగంలో 85.24% చొప్పున ఉత్తీర్ణత నమోదైనట్టు పేర్కొన్నారు. 21 విభాగాల్లో ఈ పరీక్ష నిర్వహించగా.. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ మినహా అన్ని విభాగాల ఫలితాలను విడుదల చేశారు.

B.Ed Entrance Results: రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ ప్రవేశ పరీక్షకు 13,672 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,236 హాజరయ్యారు. వీరిలో 10,908 (97.08%) మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ ఫలితాల్లో మ్యాథమెటిక్స్‌ విభాగంలో వై.సాగర్, ఫిజికల్ సైన్స్ విభాగంలో మర్రాపు తిరుపతి నాయుడు, బయోలాజికల్ సైన్స్ విభాగంలో లల్మట్టి ఆశం, సోషల్ స్టడీస్ విభాగంలో సింగవరపు బలరామ నాయుడు, ఇంగ్లీష్ విభాగంలో నవీన్ తొలి స్థానంలో నిలిచారు.

Last Updated : Jul 14, 2023, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.