APCC President Gidugu Rudraraju About Elections: ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో కాంగ్రెస్గెలుస్తుందని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. రాజ్యాంగ దినోత్సవం (Constitution Day) సందర్భంగా విజయవాడ ఆంధ్ర రత్న భవన్లో గిడుగు రుద్రరాజు.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ (BR Ambedkar) చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి అన్ని రాష్ట్రాల్లో మద్దతు పెరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా ప్రధానమంత్రి మోదీ రాష్ట్ర పర్యటనకు (PM Modi Tirupati Tour) ఏ విధంగా వస్తున్నారని ప్రశ్నించారు.
Rudraraju Met Rahul Gandhi: 'విశాఖ ఉక్కు, ఇతర సమస్యలపై రాహుల్ గాంధీకి వినతిపత్రం ఇచ్చాం'
Gidugu Rudraraju About PM Modi AP Tour: విభజన చట్టంలోని ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, గిరిజన విశ్వవిద్యాలయాలకు నిధులు, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం వంటి అంశాలను అమలు చేయకుండా ప్రధానమంత్రి మోదీ రాష్ట్రానికి రావడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్రానికి చేసిన అన్యాయంపై ప్రధానమంత్రి మోదీకి బహిరంగ లేఖ రాస్తున్నామని.. మోదీ దీనికి సమాధానం చెప్పాలన్నారు.
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేసి తీరుతామని.. ఇప్పటికే రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయని మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్ అమలు, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాడనేది కలే: తులసి రెడ్డి
Congress Leader Tulasi Reddy about Drought in Andhra Pradesh: రాష్ట్రంలో కరవు విలయ తాండవం చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ (CM YS Jagan) 103 మండలాలను మాత్రమే కరవు మండలాలుగా ప్రకటించడంలో (Drought Mandals in Andhra Pradesh) ఆంతర్యమేమిటని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో 18 జిల్లాలలో 449 మండలాలలో కరవు ఉందని అన్నారు. పులివెందుల నియోజకవర్గంలో ఒక్క మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించకపోవడంపై మండిపడ్డారు.
కడప జిల్లాలో 35 మండలాలలో కరువు విలయ తాండవం చేస్తుంటే.. ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించకపోవడంపై తులసి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రకటించిన మండలాలలో కూడా కరవు సహాయక చర్యలు ఎందుకు చేపట్టడం లేదని అన్నారు. వెంటనే 18 జిల్లాలలో 449 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.
కరవు తీవ్రతను ఎదుర్కోవడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలం : తులసిరెడ్డి