కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌కు వైకాపా ప్రభుత్వం మంగళం పాడేందుకు యత్నిస్తోందని పీసీసీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ విమర్శించారు. గుంటూరు జిల్లా తెనాలిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో రైతుల్ని ఆదుకోవటంలో జగన్ సర్కారు విఫలమైందని అన్నారు. ప్రభుత్వం అప్పులు మీద బతుకుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు.
రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా.. ముఖ్యమంత్రి జగన్‌కు కనీసం పశ్చాత్తాపం లేదనన్నారు. తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కేంద్రంలోని భాజపా సర్కారుకు తాకట్టుపెడుతున్నారని దుయ్యబట్టారు. మతం పేరుతో భాజపా రాజకీయాలు చేస్తూ.. అన్నదమ్ముల్లా ఉన్న ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని ఆరోపించారు.
ఇదీ చదవండి: 'నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలం'