ETV Bharat / state

ఫర్నిచర్ రగడ...హైకోర్టులో కోడెల పిటిషన్ విచారణ

అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు వ్యవహారంలో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. గుంటూరులోని కోడెల కుమారునికి చెందిన షోరూం నుంచి ఫర్నీచర్​ను అసెంబ్లీకి తరలించారు. అసెంబ్లీ అధికారుల ఆధ్వర్యంలో పోలీసులు ఫర్నీచర్​ను వెలగపూడి అసెంబ్లీకి తీసుకెళ్లారు. అయితే సీజ్ చేసిన షోరూం నుంచి ఫర్నీచర్ తీసుకెళ్లటం సరికాదని కోడెల కుటుంబం తరఫు న్యాయవాది వ్యాఖ్యానించారు. ఈవిషయాన్ని కోర్టుకు విన్నవిస్తామని తెలిపారు.

ఫర్నిచర్ రగడ...హైకోర్టులో కోడెల పిటిషన్ విచారణ
author img

By

Published : Aug 27, 2019, 6:45 AM IST

ఫర్నిచర్ రగడ...హైకోర్టులో కోడెల పిటిషన్ విచారణ
ఏపీ అసెంబ్లీని హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చిన సమయంలో ఫర్నీచర్​ను అప్పటి సభాపతి కోడెల శివప్రసాద్ గుంటూరుకు తీసుకెళ్లారు. అయితే ఆ విషయాన్ని అధికారులకు చెప్పి ఫర్నీచర్ తీసుకెళ్లానని...వాటిని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నానని ఈ నెల 20వ తేదీన కోడెల ప్రకటించారు. ఫర్నీచర్ తన క్యాంపు కార్యాలయాల్లో ఉందని తెలిపారు. అయితే అసెంబ్లీ అధికారులు 23వ తేదీన గుంటూరు చుట్టుగుంటలోని కోడెల కుమారునికి చెందిన గౌతం హీరో షోరూంలో తనిఖీలు చేపట్టి అక్కడ ఫర్నీచర్ ఉన్నట్లు గుర్తించారు.

ఫర్నీచర్ స్వాధీనం

పోలీసులు తనిఖీలపై కోడెల తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేయటం వలన అధికారులు తిరిగి వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై 25వ తేదిన తుళ్లూరు పోలీసు స్టేషన్​లో అసెంబ్లీ అధికారులు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఫర్నీచర్ దారి మళ్లించారని... ప్రైవేటు షోరూంలో ఉంచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మేరకు కేసు నమోదు చేసిన తుళ్లూరు పోలీసులు సోమవారం ఆ ఫర్నీచర్ స్వాధీనం చేసుకునేందుకు వచ్చారు. అసెంబ్లీ సహాయ కార్యదర్శి రాజ్ కుమార్, తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో అధికారులు షోరూంకు వచ్చారు.

కేసు నమోదు

షోరూం మేనేజర్​కు విషయం చెప్పి పోలీసులకు చెందిన వాహనాల్లో సామాగ్రిని తరలించారు. హైదరాబాద్ నుంచి నేరుగా కొంత, అమరావతి అసెంబ్లీ నుంచి మరికొంత ఫర్నీచర్ గుంటూరుకు తరలించారని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అసెంబ్లీ అధికారుల అనుమతితో తీసుకొచ్చిన వాటికన్నా ఎక్కువ ఫర్నీచర్ ఇక్కడ ఉందని డీఎస్పీ తెలిపారు. హైదరాబాద్, వెలగపూడి నుంచి తెచ్చిన 70 వస్తువుల్ని షోరూంలో గుర్తించామన్నారు. కోడెల శివప్రసాద్​తో పాటు ఆయన కుమారుడు శివరాంపై ఐపీసీ 409, 411 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సభా వ్యవహరాల కమిటీ సమావేశానికి సంబంధించిన టేబుళ్లు, కుర్చీలు, విలువైన వస్తువులున్నట్లు ఇక్కడ లభ్యమైనట్లు తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘనా...!

అసెంబ్లీ, పోలీసు అధికారుల వైఖరిని కోడెల తరఫు న్యాయవాది తప్పుబట్టారు. ఫర్నీచర్ వెనక్కు ఇస్తామని కోడెల స్వయంగా చెప్పినా అధికారులు ఇలా వ్యవహరించటం సరికాదన్నారు. ఏదో సాధించినట్లు చెప్పేందుకే అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని న్యాయవాది చిరంజీవి వ్యాఖ్యానించారు. సీజ్ చేసిన షోరూం నుంచి ఫర్నీచర్ ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. రవాణాశాఖకు జరిమానా చెల్లించిన తర్వాత మాత్రమే షోరూం తెరవాలని... అలా కాకుండా ముందుగానే తెరవటం నిబంధనలు ఉల్లంఘించటమేన్నారు. ఈ విషయంపై కోర్టులో సవాల్ చేస్తామని చెప్పారు.

కోడెల పిటిషన్​పై నేడు విచారణ

ఫర్నీచర్ అప్పగింతపై సోమవారం హైకోర్టులో కోడెల పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ నేడు విచారణకు రానుంది. ఈలోగా ఫర్నీచర్ హుటాహుటిన స్వాధీనం చేసుకోవటం కోడెలను ఇబ్బంది పెట్టేందుకేనన్న అభిప్రాయం కోడెల తరఫు వారి నుంచి వ్యక్తమవుతోంది.

ఇదీ చదవండి :

కోడెల తనయుడి షోరూంలోని అసెంబ్లీ ఫర్నిచర్​ స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.