ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 9PM - AP LATEST NEWS

ఏపీ ప్రధాన వార్తలు

TOPNEWS
TOPNEWS
author img

By

Published : Dec 20, 2022, 8:59 PM IST

  • ఏపీలో మహిళలపై అఘాయిత్యాలు ఏటా పెరుగుతున్నాయి: కేంద్రం
    మహిళలపై జరుగుతున్న దాడుల్లో ఆంధ్రప్రదేశ్‌.. యూపీ, బిహార్‌ని మించిపోతోందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అఘాయిత్యాలు ఏటా పెరుగుతున్నట్లు కేంద్ర హోం శాఖ పార్లమెంటుకు చెప్పింది. గత నాలుగైదేళ్లలో దాడుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్న కేంద్ర హోం శాఖ... లైంగిక వేధింపుల్లో అగ్రభాగాన నిలిచినట్లు స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఉచితాలు సరికాదు.. సంపద పెంచే ప్రయత్నాలు చేయాలి: వెంకయ్యనాయుడు
    Venkaiah Naidu comments: ప్రభుత్వాలు సంపదను పెంచే ప్రయత్నాలు చేయాలి కానీ... ఉచితాలు ఇవ్వడం సరికాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖలోని తగరపువలస గోస్తనీ నది సమీపంలోని అవంతి ఇంజనీరింగ్ కళాశాల స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు క్రమశిక్షణ తో, కష్టపడే మనస్తత్వం కలిగి ఉండాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పరిహారం సొమ్ములో లంచం తీసుకునే దౌర్భాగ్యం నాకు లేదు: మంత్రి అంబటి
    Minister Ambati Rambabu comments: పరిహారం సొమ్ము విషయంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం సొమ్ము నుంచి లంచం తీసుకునే దౌర్భాగ్యం తనకు లేదని వ్యాఖ్యానించారు. 5 లక్షల రూపాయల పరిహారం మంజూరు చేయించింది తానేనని,.. అలాంటిది శవాలపై పేలాలు ఏరుకోవాల్సిన అవసరం తనకు లేదని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విజయవాడ గ్యాంగ్​ రేప్​ కేసు.. ఇద్దరు అరెస్ట్​
    Gang Rape in penamaluru: పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పందించారు. ఘటనకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లండించారు. తెలిసిన వారే మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు దర్యాప్తులో నిర్థారించామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భూమిలో నుంచి ఎగసిపడ్డ మంటలు భయంతో స్థానికుల పరుగు
    ఝార్ఖండ్ ధన్​బాద్​లో భూమిలో నుంచి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సిజువా ప్రాంతంలోని బసుదేవ్​పుర్ బస్తీలో భారీ శబ్దాలతో ఓ గొయ్యిలో నుంచి మంటలు వచ్చాయి. దీంతో ఘటనాస్థలికి వంద మీటర్ల పరిధిలో ఉన్న ప్రజలంతా భయంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు. కాగా, సమీపంలోనే భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ అనే కంపెనీ ఓ మైనింగ్ ప్రాజెక్టు చేపడుతోంది. ఈ ఘటన గురించి తెలుసుకొని సంస్థ అధికారులు ఆ ప్రాంతానికి హుటాహుటిన వచ్చి పరిస్థితిని సమీక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రభుత్వ ప్రిన్సిపల్​ సెక్రెటరీ డేటా హ్యాక్​.. మైనర్, అతని తండ్రి అరెస్ట్​
    ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వ రూరల్​ వాటర్​ సప్లై డిపార్ట్​మెంట్​ ప్రిన్సిపల్​ సెక్రెటరీ డేటా హ్యాక్ అయింది. జల్​ జీవన్​ పథకానికి ఐటీ కన్సల్టెంట్​గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఈ సైబర్ నేరానికి పాల్పడ్డాడు. నిందితున్ని, అతని మైనర్​ కొడుకును పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితులకు సాయం చేసిన మరో ముగ్గురిని సైతం అరెస్ట్​ చేశారు పోలీసులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఈడీ'కి మస్కా.. విచారణకు టీఎంసీ నేత డుమ్మా.. అరెస్ట్ చేసి 'కాపాడిన' పోలీసులు!
    ఈడీ విచారణ ఎదుర్కోవాల్సిన టీఎంసీ నేతను బంగాల్ పోలీసులు ముందుగానే అరెస్టు చేసి ఆయనకు రక్షణ కల్పించారు! పాత కేసులో ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయస్థానం ఏడు రోజుల కస్టడీ విధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • IFSC, MICR అంటే ఏంటి? వాటి వల్ల ఉపయోగాలు తెలుసా?
    సాధారణంగా బ్యాంకుల ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపినప్పుడు ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఐసీఆర్‌ కోడ్‌ల గురించి వింటుంటారు. ముఖ్యంగా డిజిటల్‌ లావాదేవీలు, నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్‌ వంటి ఎలక్ట్రానిక్‌ లావాదేవీల్లో ఐఎఫ్ఎస్​సీ కోడ్ అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో ఐఎఫ్ఎస్​సీ కోడ్​ గురించి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బరిలో దిగాడంటే ఇక సెంచరీలే.. అదీ సూర్యకుమార్​ యాదవ్​ లెక్క!
    పొట్టి కప్పు పోటీల్లో జరిగిన హోరాహోరీ పోరులో టీమ్​ ఇండియా మిస్టర్‌ 360 ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తనదైన ప్రతిభతో అభిమానుల మనసులను కొల్లగొట్టాడు. ఆడిన ప్రతి మ్యాచుల్లో బాల్​ను బౌండరీ దాటించి ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. అలా ఈ ఏడాది టీ20ల్లో సూర్యకుమార్​ ఆడిన కొన్ని షాట్లు చూసి షాకవ్వడం విశ్లేషకుల వంతు అయ్యింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మహేశ్ బాబు కోసం సిద్ధం చేసిన కథలో హీరోగా​ ఆలీ!
    'ఆలీతో సరదాగా షో'తో కమెడియన్​ ఆలీ ఎంతో మందికి చేరువయ్యారు. కమెడియన్​గా మంచి స్టార్​డం తెచ్చుకున్న ఈయన పలు సినిమాల్లో హీరోగా కూడా చేశారు. లేటెస్ట్​గా తన ప్రోగ్రాంకు తనే గెస్ట్​గా వచ్చి అలరించారు. ఆ సమయంలో హోస్ట్​గా వ్యవహరించిన యాంకర్​ సుమతో ఆయన పలు విషయాలు పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.