ETV Bharat / state

TOP NEWS : ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM - ap top ten news

ఏపీ ప్రధాన వార్తలు

TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు
author img

By

Published : Dec 16, 2022, 7:03 PM IST

  • కృష్ణా జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఒకరు మృతి, నలుగురు విద్యార్థులు గల్లంతు
    కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. కృష్ణా నదిలోకి ఈతకు వెళ్లిన విద్యార్థులు ఐదుగురు గల్లంతయ్యారు. వారిలో ఒక విద్యార్థి మృతి చెందగా మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తీరు మార్చుకోకపోతే, టిక్కెట్లు కష్టమే.. ఆ ఎమ్మెల్యేలకు సీఎం జగన్​ హెచ్చరిక
    JAGAN WARNING TO MLAs: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వెనుకబడిన వైసీపీ MLAలకు.. ముఖ్యమంత్రి జగన్‌ మరోసారి గట్టి హెచ్చరికలు జారీచేశారు. ఎమ్మెల్యేలు తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఇచ్చిన హామీని జగన్ నిలబెట్టుకోవాలి: సీఐటీయూ
    Municipal Employees Poster Release: ప్రభుత్వం కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు కోరారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ 14వ మహాసభలు ఈనెల 20న అనంతపురంలో జరగనున్నాయి. ఈ క్రమంలో విజయవాడ ఎంబీవీకే భవన్‌లో మహాసభల గోడ పత్రికను ఫెడరేషన్ ప్రతినిధులు విడుదల చేశారు. ఈ సమావేశంలో పైవిధంగా వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భూమా శోభ నాగిరెడ్డికి నాగమౌనిక, మంచు మనోజ్​ నివాళులు
    Manchu Manoj Tribute to Bhuma Shobha Nagireddy : ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే, దివంగత భూమా శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా.. ఆమె కుమార్తె భూమా నాగ మౌనికతో కలిసి సినీ నటుడు మంచు మనోజ్​ నివాళులర్పించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో శోభ నాగిరెడ్డి సమాధి వద్ద ఇద్దరు కలిసి నివాళులర్పించారు. వీరిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దివ్యాంగుడి సజీవదహనం.. వెంట ఉన్న మహిళేనా నిందితురాలు ?
    Person with disability was killed: అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అర్ధరాత్రి వికలాంగుడి సజీవ దహనం ఘటన కలకలం సృష్టించింది. పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి వెంట వచ్చిన మహిళనే నిందితురాలిగా పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మోదీ- పుతిన్​ ఫోన్​ కాల్​.. ఉక్రెయిన్​తో యుద్ధం ముగింపుపైనే ప్రధాన చర్చ!
    పుతిన్‌-మోదీ మధ్య ఫోన్‌ సంభాషణ జరిగినట్లు పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్​తో యుద్ధానికి ముగింపునకు దౌత్యమే ఏకైక మార్గమని రష్యా అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఈ సంభాషణలో మరోమారు స్పష్టం చేసినట్లు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • హైకోర్ట్​ విశ్రాంత ప్రధాన న్యాయమూర్తికి ట్రావెల్​ ఏజెన్సీ బురిడీ.. దుబాయ్​ టూ దిల్లీకి నకిలీ టికెట్​ ఇచ్చి..
    దుబాయ్​ వెళ్లి టూర్ ముగించుకొని ఇండియా వచ్చే సమయంలో ఓ హైకోర్ట్​ రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తికి ​ట్రావెల్ ఏజెన్సీ వారు నకిలీ టికెట్​ను ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చేసేదేమి లేక ఆయన వేరే టికెట్స్ బుక్ చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. అసలేం జరిగిందంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా భీకర దాడి.. 60కిపైగా క్షిపణుల ప్రయోగం.. ఆ ప్రాంతాల్లో కరెంట్​ కట్​
    ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి క్షిపణుల వర్షం కురిపించింది. కీవ్‌, ఖార్కివ్‌ సహా నాలుగు నగరాలపై 60కిపైగా క్షిపణులు ప్రయోగించింది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత పట్టణంలో క్షిపణి దాడికి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. ఖార్కివ్‌ సహా అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా లేక ప్రజలు అల్లాడుతున్నారు. అనేక చోట్ల రైళ్లను స్టీమ్‌ ఇంజిన్లతో నడపాల్సిన పరిస్థితి నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • IND VS BAN: గిల్.. ఇదే జోరు కొనసాగిస్తే కేఎల్‌కు ఎసరు
    బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్టులో శుభమన్​ గిల్​ సెంచరీతో చెలరేగాడు. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్న అతడు ఈ మార్క్​ను అందుకున్నాడు. ఇతడు ఇకపై ఇలానే జోరు కొనసాగిస్తే కేఎల్ రాహుల్​ స్థానం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తండ్రి కాబోతున్న స్టార్ డైరెక్టర్​ అట్లీ
    కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ తీపికబురు చెప్పారు. తన భార్య ప్రియ తల్లి కానుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.