- దక్షిణ కొరియాలో విషాదం.. హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట.. 149 మంది దుర్మరణం
దక్షిణకొరియాలో తీవ్ర విషాదం నెలకొంది. హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట జరిగి 149 మంది దుర్మరణం చెందగా వందకుపైగా గాయపడ్డారు. రోడ్లపై గాయాలతో పడి ఉన్న వారిని చూసి అత్యవసర సిబ్బంది, పాదచారులు ప్రథమ చికిత్స చేశారు. సినీ తారను చూసేందుకు ఇరుకైన వీధిలో జనం పరుగులు తీయడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
- బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా రాజధాని.. 30 మంది మృతి
సోమాలియా రాజధాని బాంబు పేలుళ్లతో ఒక్కసారిగా దద్దరిల్లింది. దేశంలో హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కొనడానికి ప్రధానితో సహా ఉన్నతాధికారులంతా చర్చిస్తున్న సమయంలో ఈ దాడులు సంభవించాయి. ఈ ఘటనలో సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
- జానపద కళాకారులతో స్టేజ్‌పై డ్యాన్స్ చేసిన సీఎం
సాధారణంగా ఏదైనా వేదికపై కళాకారులు డ్యాన్స్ చేయడం మనం చూస్తుంటాం. కానీ ఓ వేదికపై ముఖ్యమంత్రి చిందులు వేసి అందర్నీ ఉత్తేజపరిచారు. శనివారం మౌనీయ మహోత్సవం సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఛతర్‌పుర్ వెళ్లారు. ఈ నేపథ్యంలో జానపద కళాకారులతో దివారీ నృత్యం చేశారు. ప్రస్తుతం సీఎం డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- గడప గడపకు ప్రభుత్వంలో.. ఆ ఎమ్మెల్యేకి అడుగడుగున ప్రశ్నలే..
Gapada gadapaki mana prabhuthvam: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. సొంత కార్యకర్తల నుంచే నిరసన ఎదురవడంతో సర్ది చెప్పుకోలేక పక్కకు వెళ్లారు. పార్టీలో ఉన్న కార్యకర్తలకే న్యాయం జరగడంలేదని ఇంకా ప్రజల సమస్యలు ఎం పరిష్కరిస్తారని నిలదీశారు.
- అయ్యప్ప మాలతో స్కూలుకు వచ్చాడని ఇంటికి పంపిన ఉపాధ్యాయుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Kadapa Pulivendula: అయ్యప్ప మాలతో స్కూలుకు వచ్చాడని ఓ విద్యార్థి ఉపాధ్యాయుడు మాల తీసి ఇంటికి పంపిన ఘటన కడప జిల్లాలో కలకలం రేపింది. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, హిందు సంఘాలతో కలిసి పాఠశాల ఉపాధ్యాయుడిని నిలదీశారు. దీంతో ఆ టీచర్ చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
- Pawan Kalyan: నేతలకు, వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుంది: పవన్
Pawan Kalyan: పవన్‌కల్యాణ్ విశాఖ పర్యటనలో కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లి వ్చచిన వారిని జనసేన అధినేత ఆత్మీయంగా పరామర్శించారు. తొమ్మిది మంది నాయకులను పేరు పేరునా పలకరించారు. నాయకులకు, వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు.
- ఫ్యాన్ వేసినందుకు విద్యార్థిని కొట్టిన టీచర్..
case against a teacher in AP: వైఎస్ఆర్ కడప జిల్లాలోని వేంపల్లిలోని పాఠశాలలో ఫ్యాన్ వేసినందుకు.. ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ.. వెన్నెల అనే విద్యార్థిని కొట్టాడు. విషయం తెలుసుకున్న వెన్నెల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటపై విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సైతం అతనిపై అనేక అరోపణలు ఉన్నప్పటీకి అధికారులు అతనికి సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
- ఆ సినిమాలో చిరుతో కలిసి నటించడానికి కృష్ణ నో చెప్పారట.. ఎందుకంటే
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ హిట్ సినిమాలో ముఖ్య పాత్ర కోసం సూపర్ స్టార్ కృష్ణను సంప్రదిస్తే నో చెప్పారట. ఎందుకంటే?
- స్టన్నింగ్ క్యాచ్.. గాల్లోకి ఎగిరి మరీ.. సచిన్ బంతిని భలే పట్టేశాడుగా!
సోషల్‌మీడియాలో ఓ క్రికెటర్ పట్టుకున్న అద్భుత క్యాచ్‌కు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. దాదాపు రెండు దశాబ్దాల కింద జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకున్న సూపర్ మూమెంట్ ఇది. అయితే ఆ బంతి దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ది కావడం మరో విశేషం. ఆ వీడియో మీరు చూసేయండి..
- Slice Card వాడుతున్నారా?.. ఇక ఆ కార్డులు పనిచేయవ్!
ఆర్బీఐ నిబంధనల నేపథ్యంలో స్లైస్ కార్డు తన ప్రీపెయిడ్ కార్డు సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నవంబరు చివరి నుంచి ఈ కార్డులు లావాదేవీల వినియోగానికి పనికిరావని పేర్కొంది.