ETV Bharat / state

చూస్తూ వదిలేయలేదు.....మానవత్వం చాటిన విద్యాశాఖమంత్రి....

ఆ దారిలో విద్యా శాఖ మంత్రి వెళ్తున్నారు. ఇంతలో అక్కడ ప్రమాదం జరిగింది. వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ ఘటన చూసిన మంత్రి ఏం చేశారంటే?

దంపతులను కాపాడిన మంత్రి
author img

By

Published : Jul 15, 2019, 9:15 AM IST

Updated : Jul 15, 2019, 5:09 PM IST

దంపతులను కాపాడిన మంత్రి

ప్రమాదంలో గాయపడిన దంపతులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కాపాడారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామానికి చెందిన శంకరమంచి లక్ష్మీనారాయణ దంపతులు నరసరావుపేట వెళ్లి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తున్నారు. కట్టుబడివారిపాలెం యూటర్న్ వచ్చేసరికి పక్కనే ఉన్న రెస్టారెంట్​లో నుంచి హఠాత్తుగా యువకులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఢీకొట్టడంతో దంపతులు ఇద్దరూ కిందపడ్డారు . అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి ప్రమాద సంఘటన చూసి వాహనాన్ని నిలిపి వారికి ధైర్యం చెప్పారు. సమీపంలోని ఆర్.ఎం.పి వైద్యున్ని పిలిపించి ప్రాథమిక వైద్యం అందించారు . అనంతరం 108 అంబులెన్స్​ పిలిపించి చికిత్స కోసం నరసారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంత్రి కాన్వాయ్ రాక చూసిన ఆ యువకులు అక్కడి నుంచి పారిపోయారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: ట్రాక్టరు, జీపు ఢీ... 10మందికి గాయాలు

Intro:స్క్రిప్ట్ కడప జిల్లా రాయచోటి లోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు వైద్యాధికారి వాయిస్

Body:స్క్రిప్ట్ కడప జిల్లా రాయచోటి లోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు వైద్యాధికారి వాయిస్

Conclusion:స్క్రిప్ట్ కడప జిల్లా రాయచోటి లోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు వైద్యాధికారి వాయిస్
Last Updated : Jul 15, 2019, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.