ETV Bharat / state

చంద్రమోహన్‌ మృతి తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్రమ‌కి తీర‌ని లోటు- ఏపీ నాయకులు - Governor Abdul Nazir condoled Chandramohan

AP Politicians Condoled the Death of Chandramohan: సీనియర్​ నటుడు చంద్రమోహన్​ కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

ap_politicians_condoled_chandramohan
ap_politicians_condoled_chandramohan
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2023, 1:47 PM IST

AP Politicians Condoled the Death of Chandramohan: టాలీవుడ్​ ప్రముఖ సీనియర్​ నటుడు చంద్రమోహన్​ (82) కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. దీంతో యావత్​ సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

CM Jagan Condoled the Death of Actor Chandramohan: సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతిపట్ల సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్ను మూయ‌డం బాధాక‌రమని అన్నారు. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయ‌న తెలుగు, త‌మిళ భాషల్లో వంద‌లాది సినిమాల్లో న‌టించి తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారని అన్నారు. చంద్ర‌మోహ‌న్ గారి కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తూ, ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నానని జగన్ తెలిపారు.

  • ప్ర‌ముఖ న‌టుడు చంద్ర‌మోహ‌న్ గారు అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్ను మూయ‌డం బాధాక‌రం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయ‌న తెలుగు, త‌మిళ భాషల్లో వంద‌లాది సినిమాల్లో న‌టించి తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. చంద్ర‌మోహ‌న్ గారి కుటుంబ స‌భ్యుల… pic.twitter.com/XklbQ0l1o5

    — YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

చంద్రమోహన్ - 1000 సినిమాలు చేసి, 100 కోట్లు పోగొట్టుకొని, స్థిరంగా నిలబడి!

Governor Abdul Nazir Condoled the Death of Actor Chandramohan: చంద్రమోహన్ మృతిపట్ల గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని దేవున్ని ప్రార్థించారు.

Pawan Kalyan Condoled the Death of Actor Chandramohan: సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతిపట్ల జనసేన అధినేత సినీ యాక్టర్ పవన్ కల్యాణ్​ సంతాంపం వ్యక్తం చేశారు. ఆయన మృతి చెందారని తెలిసి ఆవేదన చెందారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు.

Nara Lokesh Condoled the Death of Actor Chandramohan: సీనియ‌ర్ న‌టులు చంద్రమోహ‌న్ మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ విచారం వ్యక్తం చేశారు. హీరోగా, కమెడియ‌న్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు అల‌వోక‌గా పోషించిన న‌టుడు చంద్రమోహన్‌ మ‌ర‌ణం తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్రమ‌కి తీర‌ని లోటని అన్నారు. వారి ఆత్మకి శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తూ, చంద్రమోహన్‌ కుటుంబ‌స‌భ్యుల‌కి లోకేశ్​ ప్రగాఢ సంతాపం తెలిపారు.

  • సీనియ‌ర్ న‌టులు చంద్ర‌మోహ‌న్ గారి మృతి బాధాక‌రం. హీరోగా, కమెడియ‌న్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు అల‌వోక‌గా పోషించిన న‌టుడు చంద్ర‌మోహ‌న్ గారి మ‌ర‌ణం తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు. వారి ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తూ, కుటుంబ‌స‌భ్యుల… pic.twitter.com/ilKNoPhAfE

    — Lokesh Nara (@naralokesh) November 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'వైవిధ్య నటనతో చెరగని ముద్ర'- చంద్రమోహన్ మృతిపై చిరంజీవి సంతాపం

Balakrishna Condoled the Death of Actor Chandramohan: సినీనటుడు చంద్రమోహన్ మృతి పట్ల టీడీపీ ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. పౌరాణిక చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, తన హాస్యానటనతో తెలుగు ప్రేక్షకులను చంద్రమోహన్ ఆకట్టుకున్నారని గుర్తు చేసుకున్నారు. చంద్రమోహన్​తో పాటు పలు చిత్రాల్లో నటించానని.. ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు. చంద్రమోహన్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు బాలకృష్ణ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Achchennaidu Condoled the Death of Actor Chandramohan: సినీ రంగంలో తనదైన ముద్రవేసిన చంద్రమోహన్ 932 చిత్రాల్లో నటించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్న అన్నారు. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగారన్నారు. తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్న వ్యక్తి చంద్రమోహన్ అని తెలిపారు.

కొత్త హీరోయిన్ల లక్కీ స్టార్​ - ప్రతి పాత్ర చేయడానికి అదే కారణం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.