ETV Bharat / state

'రాష్ట్ర దారుణ పరిస్థితికి... గత ప్రభుత్వమే కారణం'

ప్రభుత్వంపై తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు, యనమల కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతు భరోసాను ఏడాదిముందే అమలు చేయడం, మద్యం దుకాణాలను క్రమంగా తగ్గించడాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర దారుణ పరిస్థితికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

ap minister
author img

By

Published : Oct 23, 2019, 2:40 PM IST

రాష్ట్ర దారుణ పరిస్థితికి గత ప్రభుత్వమే కారణం..

బాధ్యత గలిగిన ప్రతిపక్ష నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం శోచనీయమని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, యనమల కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతు భరోసాను ఏడాదిముందే అమలు చేయడం, మద్యం దుకాణాలను క్రమంగా తగ్గించడాన్ని చూసి ఓర్వలేకపోతున్నారన్నారు.

ఇసుక విషయంలో ఇబ్బందులు వాస్తవమే...
ఇసుక విషయంలో ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం అంగీకరిస్తుందన్న మంత్రి... కొద్దిరోజుల్లో సమస్యను పరిష్కరిస్తామన్నారు. నదుల్లో వరదల కారణంగా ఇబ్బందులు వచ్చాయన్నారు. రాష్ట్ర ఆర్థిక విషయాల్లో తెదేపా గంటకోమాట మారుస్తోందన్న బుగ్గన... తెదేపా నేతలు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని అందరికీ తెలుసనని ఎద్దేవా చేశారు.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఏపీ వెనుకంజ...
గత ఐదేళ్లలో తెదేపా ప్రభుత్వం విఫలమైందని నీతిఆయోగ్‌ నివేదిక ద్వారా బయటపడిందని బుగ్గన ఆరోపించారు. 2014 నుంచి చాలా పరిశ్రమలకు రాయితీలు ఇవ్వలేదని.. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లోనూ ఆంధ్రప్రదేశ్‌ వెనుకంజలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉండటానికి గత ప్రభుత్వమే కారణమన్నారు.

ఆ ఒప్పందం తెదేపా హయాంలోనే జరిగింది..
కర్ణాటకలోని కుడిగి ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం తెదేపా హయాంలోనే చేసుకున్నారన్న మంత్రి... పవన, సౌర విద్యుత్ కొనుగోలుకు థర్మల్ విద్యుత్‌ను తగ్గించాలని కూడా తెదేపా హయాంలోనే నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి కొనుగోలు చేయకపోయినా ఫిక్స్‌డ్‌ ఛార్జీలు చెల్లించాలని... మహానది కోల్ ఫీల్డ్స్‌లో ప్రమాదం జరిగితే సింగరేణి నుంచి అధిక ధరకు బొగ్గు కొనుగోలు చేయాల్సి వచ్చిందని వివరించారు. ఈ క్రమంలో 17 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేశామన్న బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ...గత ప్రభుత్వం హయాంలోని ఒప్పందాలను గుర్తు చేస్తూ వాళ్ల పార్టీ పరువు వాళ్లే తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 2014 కు ముందునుంచే దేశవ్యాప్తంగా విద్యుత్ అదనపు ఉత్పత్తి ఉందన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.