మంచి హాకీ క్రీడాకారులను తయారు చేసే ప్రాంతంగా భువనేశ్వర్ జాతీయ స్ధాయిలో ప్రసిద్ధి పొందిందని... ఏపీని ఆ దిశగా మార్చేందుకు సహకారం అందించాలని హాకీ అసోసియేషన్ ప్రతినిధులు గవర్నర్ బిశ్వభూషణ్కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర హాకీ అసోసియేషన్ ఐదవ వార్షికోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని... ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అవార్డులు అందించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన బిశ్వభూషణ్ తగిన సమయం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: ఏపీ సీఎం కప్ రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ విజేతగా విశాఖ