ETV Bharat / state

High Court on R5 Zone Issue: ఇళ్ల స్థలాల కేటాయింపుపై రైతుల అనుబంధ పిటిషన్లు కొట్టివేత

High Court on R5 Zone Issue: ఆర్‌-5 జోన్‌పై రైతుల అనుబంధ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. ఇళ్ల పట్టాల పంపిణీ అనేది తుది తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు తెలిపింది. ఇందులో భాగంగా స్థానికేతరులకు పట్టాలు ఇవ్వడంపై రైతులు వేసిన అనుబంధ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది.

High Court on R5 Zone Issue
High Court on R5 Zone Issue
author img

By

Published : May 6, 2023, 6:51 AM IST

Updated : May 6, 2023, 9:40 AM IST

High Court on R5 Zone Issue: రాజధానేతర ప్రాంత ఆర్థిక వెనుకబడిన తరగతులకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రక్రియను నిలువరించేందుకు హైకోర్టు నిరాకరించింది. రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కొట్టేసింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లకు భూ బదలాయింపు చేస్తూ ఇచ్చిన జీవో 45, ఆ జీవో పర్యావసానంగా జరిపే ఇళ్ల స్థలాల కేటాయింపు ఈ వ్యాజ్యాల్లో తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్రా, జస్టిస్ రవినాథ్ తిల్లరీతో కూడిన ధర్మాసనం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

గతంలో రూపొందించిన బృహత్తర ప్రణాళికలో ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు నిర్థిష్టమైన ప్రాంతాన్ని రిజర్వు చేసినట్లు కనిపించడం లేదని హైకోర్టు తీర్పులో పేర్కొంది. ఎలక్ట్రానిక్ సిటీ కోసం కేటాయించిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తోందని, ఆ భూమి భూసమీకరణ పథకం కింద లే అవుట్ల కోసం కేటాయించిన దానిలో భాగం కాదని తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపింది. ఈడబ్ల్యూఎస్ వారికి ఇవ్వదలచిన ప్రాంతంపై పిటిషనర్లకు ప్రత్యక్ష సంబంధం లేదని తాము గమనించామని తెలిపింది.

ఇళ్ల స్థలాల కోసం ప్రతిపాదించిన భూమి ఎలక్ట్రానిక్ సిటీ కోసం రిజర్వు చేసిందని పేర్కొంది. రాజధాని అభివృద్ధి నవనగరాలతో ముడిపడి ఉందా అనే వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని.. ఎలక్ట్రానిక్ సిటీకి కేటాయించిన భూముల్లో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు పొందే హక్కు లేనందున.. ఇళ్ల స్థలాలు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయం వల్ల రైతులపై నేరుగా ప్రభావం ఉండదని ధర్మాసనం తెలిపింది. రాజధాని నగరాభివృద్ధి కోసం భూసమీకరణలో భూములు ఇచ్చామని, ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటు సైతం ఆ అభివృద్ధిలో భాగమని, ఎలక్ట్రానిక్ సిటీ మూలాలను దెబ్బతీయడం తమ హక్కులను హరించడమేనని పిటిషనర్లు వాదించారు.

ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వద్ద పెండింగ్లో ఉందని.. రాజధాని నగర నిర్మాణం, రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పులోని రెండో ఆదేశాన్ని సుప్రీంకోర్టు (2022 నవంబర్ 28న ఇచ్చిన ఉత్తర్వుల్లో) నిలుపుదల చేయలేదని హైకోర్టు తెలిపింది. అభివృద్ధి పనులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అనుమతిచ్చిందని.. ఈడబ్ల్యూఎస్, దారిద్య్ర రేఖకు దిగువున జీవిస్తున్నవారితో సహా సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి అందులో భాగమేనని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీ పెండింగ్​లో ఉండగా పిటిషనర్లు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం న్యాయ మర్యాదను ఉల్లంఘించడమే అవుతుందని తీర్పులో తెలిపింది. గతేడాది నవంబర్ 28న సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఈ వ్యవహారంతో ముడిపడి ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని పిటిషనర్లు వేసిన అన్ని అనుబంధ పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.

రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలో 1134 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లకు భూబదలాయిపు నిమిత్తం సీఆర్డీఏ కమిషనరు అనుమతిస్తూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఈ ఏడాది మార్చి 31న జీవో 45 జారీ చేశారు. ఆ జీవోను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత రైతులు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. 'హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా, జస్టిస్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై మొదటిసారి విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. తదనంతరం జస్టిస్ జయసూర్య విచారణ నుంచి వైదొలిగారు. హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్రా, జస్టిస్ రవీనాథ్ తిల్హరీతో కూడిన ధర్మాసనం ఈనెల 3న మరోసారి విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. రైతులు వేసిన అనుబంధ పిటీషన్లను కొట్టేస్తూ నిర్ణయాన్ని వెల్లడించింది.

పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దేవదత్ కామత్, వీఎస్ఆర్ అంజనేయులు వాదనలు వినిపించారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయిస్తోందన్నారు. భూములిచ్చిన రైతుల హక్కులను హరించేలా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సీఆర్డీఏ తరపున కాసా జగన్మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ఇళ్ల స్థలాలిస్తున్నామన్నారు. మధ్యంతర ఉత్తర్వులివ్వొద్దని కోరారు.

నేడు సుప్రీంకోర్టులో స్పెషల్​ లీవ్​ పిటిషన్​: రాజధాని అమరావతిలో బయట ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు.. ప్రభుత్వం చేపట్టిన చర్యలపై.. రాజధాని రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. రైతుల అనుబంధ పిటిషన్ కొట్టివేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చిన తర్వాత రాజధాని రైతు ఐకాస సమన్వయ కమిటీ సభ్యులు.. న్యాయనిపుణులతో చర్చించారు. మందడం రైతు కట్టా రాజేంద్ర వరప్రసాద్, కురగల్లు వాసి వూట్ల శివయ్యలు ఇవాళ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. బృహత్ ప్రణాళిక ప్రకారం కాలుష్య రహిత వ్యాపార, వాణిజ్య సంస్థలు రావాల్సిన ప్రాంతంలో.. ప్రభుత్వం సెంటు భూమి కూడా పంపిణీకి సిద్ధపడడం తగదని రైతులు అభిప్రాయపడ్డారు. మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేసేటప్పుడు కచ్చితంగా భూములు ఇచ్చిన రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మందడం శిబిరంలో న్యాయదేవత విగ్రహం వద్ద రైతులు మోకాళ్లపై నిల్చొని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 6, 2023, 9:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.