AP High Court on Public Representatives Cases : ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ ఏ దశలో ఉందో పూర్తి వివరాలను పట్టిక రూపంలో నివేదిక ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ప్రత్యేక కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి, అవి ఏ దశంలో ఉన్నాయి, ఏ చట్టం ప్రకారం ఏ సెక్షన్ కింద కేసు నమోదు అయ్యింది, అభియోగాలు నమోదు చేశారా? లేదా? విచారణ జాప్యానికి కారాణాలేమైనా ఉన్నాయా? తదితర వివరాలు పట్టికలో పేర్కొనాలని తెలిపింది.
హైకోర్టు సంచలన నిర్ణయం - ఎన్నికల వేళ ప్రజాప్రతినిధుల కేసుల విచారణ వేగవంతానికి చర్యలు
HC Measures to Speed Up Cases MPs and MLAs : పోక్సో, అవినీతి నిరోధక చట్టం, ఎస్సీ, ఎస్టీ, పీఎల్‌ఎంఏ, ఎన్డీపీఎస్ వంటి ప్రత్యేక చట్టాల కింద కేసులు నమోదైన సందర్భంలో ఆ కేసులను ఏ కోర్టు విచారణ జరపాలనే వ్యవహారంపైనా స్పష్టత ఇవ్వాలని ఏజీ శ్రీరామ్, విజయవాడ ప్రత్యేక కోర్టు తరఫు న్యాయవాది వివేక్‌చంద్ర శేఖర్‌కు సూచించింది. సంబంధిత తీర్పులను అధ్యయనం చేయాలని సూచించింది. చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకొని విచారణలల్లో జాప్యం జరగకుండా చూడాల్సిన అవసరం తమపై ఉందని వ్యాఖ్యానించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ, హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులను విచారించే విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ ఎం.కిరణ్మయితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
AP High Court Suo Moto PIL Against MPs and MLAs Cases : ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితర ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణలలో జాప్యాన్ని నివారించేందుకు సుప్రీంకోర్టు 2023 నవంబర్ 09న పలు మార్గదర్శకాలు జారీ చేసింది. కేసులను పర్యవేక్షించేందుకు హైకోర్టుల్లో ప్రత్యేక ధర్మాసనాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు జారీచేస్తూ విచారణ అవరోధాలను తొలగించాలని తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సుమోటోగా పిల్ నమోదు చేసింది.
ప్రజాప్రతినిధుల పెండింగ్ కేసులపై హైకోర్టులో విచారణ - పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశం
HC Suo Moto PIL Against Public Representatives Cases : రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రజాప్రతినిధులపై నమోదైన ఎక్కువశాతం కేసులు విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యాయని ఆయన అన్నారు. ప్రత్యేక కోర్టు నుంచి హైకోర్టు నివేదిక తెప్పించుకోవాలని సూచించారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తన వంతు సహకారం అందిస్తుందని తెలిపారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాజ్య విచారణలో కోర్టుకు సహాయకులుగా ఉండేందుకు సీనియర్ న్యాయవాదిని నియమిస్తామని తెలిపింది. విజయవాడ ప్రత్యేక కోర్టు నుంచి నివేదిక కోరుతూ విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
ప్రజాప్రతినిధులపై కేసులు - ప్రత్యేక ధర్మాసనం కోసం హైకోర్టులో విచారణ