ETV Bharat / state

AP High Court Hearing on Payment of Rent to Capital Farmers: 'రాజధాని రైతుల కౌలు చెల్లింపు'... హైకోర్టులో విచారణ ఈ నెల 30కి వాయిదా

AP High Court Hearing on Payment of Rent to Capital Farmers: రాజధాని కోసం భూములిచ్చిన వారికి వార్షిక కౌలు చెల్లించడంలో రాష్ట్రప్రభుత్వం, సీఆర్‌డీఏ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్న మురళీధరరావు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు.

AP_High_Court_Hearing
AP_High_Court_Hearing
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 17, 2023, 12:25 PM IST

AP High Court Hearing on Payment of Rent to Capital Farmers : రాజధాని కోసం భూములిచ్చిన వారికి వార్షిక కౌలు చెల్లించడంలో రాష్ట్రప్రభుత్వం, సీఆర్‌డీఏ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్న మురళీధరరావు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వార్షిక కౌలు చెల్లించాల్సిన చట్టబద్ధ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏపై ఉందన్నారు. కౌలు చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆకలితో అలమటిస్తున్నారన్నారు. రైతులు అభ్యర్థనను మానవత్వంతో పరిశీలించాలని కోరారు.

మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం రాజధాని రైతులకు కౌలు చెల్లింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కడపకు చెందిన న్యాయవాది బైరెడ్డి సాయి ఈశ్వర్‌ రెడ్డి ఈ వ్యాజ్యంలో అనుబంధ పిటిషన్‌ వేశారు. తనను ప్రతివాదిగా చేర్చుకోవాలని ఇంప్లీడ్‌ దాఖలు చేశారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఇంప్లీడ్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్లను, సీఆర్‌డీఏను ఆదేశించారు. విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ ఈమేరకు ఉత్తర్వులిచ్చారు.

Amaravati Framers Protest Completed 1400 Days: 1400 రోజులు పూర్తిచేసుకున్న అలుపెరుగని పోరాటం..

Capital Farmers Issue in AP High Court : రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించకపోవడాన్ని ప్రశ్నిస్తూ "అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య" సంయుక్త కార్యదర్శి కల్లం రాజశేఖర్‌రెడ్డి, "రాజధాని రైతు పరిరక్షణ సమితి" సంయుక్త కార్యదర్శి ధనేకుల రామారావు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. కౌలు చెల్లించేలా ఆదేశించాలని, జాప్యానికి వడ్డీ, చట్ట నిబంధనలను అనుసరించడంలో విఫలమైనందుకు బాధ్యులైన అధికారుల నుంచి పిటిషనర్‌ సొసైటీ సభ్యులకు పరిహారం ఇప్పించేలా ఆదేశించాలని కోరారు.

ఇంప్లీడ్‌ పిటిషనర్‌ తరఫున న్యాయవాది వివేకానంద విరూపాక్ష వాదనలు వినిపించారు. సీఆర్‌డీఏ చట్ట నిబంధనల మేరకు భూసమీకరణ పథకానికి శాసనసభ ఆమోదం తెలపలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి రైతులకు వార్షిక కౌలు చెల్లింపు చట్ట విరుద్ధం అన్నారు. సీఆర్‌డీఏ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నుంచి మాత్రమే కౌలు చెల్లించాల్సి ఉందన్నారు. పిటిషనర్‌ ట్యాక్స్‌ పేయర్‌ అని, ఆయన చెల్లించే సొమ్మును చట్ట నిబంధనలకు అనుగుణంగా ఖర్చు చేయకపోతే ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు.

Amaravati Farmers Land Rent Funds Delayed: రాజధాని రైతులకు తప్పని కన్నీటి వెతలు.. ప్రభుత్వ నిర్వాకంతో చుట్టుమడుతున్న ఆర్థిక కష్టాలు

రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. ఇంప్లీడ్‌ పిటిషన్‌కు విచారణ అర్హత లేదన్నారు. కౌలు చెల్లింపు విషయం రైతులకు, సీఆర్‌డీఏ మధ్య వ్యవహారం అన్నారు. ఏటా మే 1లోపు వార్షిక కౌలు చెల్లించాల్సిన చట్టబద్ధ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏపై ఉందన్నారు. ఇప్పటి వరకు కౌలు చెల్లించలేదన్నారు. భూములిచ్చిన వారి చట్టబద్ధ హక్కులను అమలు చేయాలని రైతులు కోరుతున్నారన్నారు.

సొమ్ము విడుదల చేయాలని సీఆర్‌డీఏ కమిషనర్‌.. ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తుచేశారు. కౌలు చెల్లింపుకోసం బడ్జెట్‌ విడుదల చేసినప్పటికీ పురపాలకశాఖ రైతుల ఖాతాల్లో జమ చేయలేదన్నారు. గత తొమ్మిదేళ్లుగా రైతులకు కౌలు చెల్లిస్తున్నారన్నారు. సొమ్ము చెల్లింపులో మరింత జాప్యం చేయాలన్న రాజకీయ కారణాలతో దురుద్దేశంతో ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేశారన్నారు. తాము దాఖలు చేసిన పిటిషన్‌పై సీఆర్‌డీఏ అభ్యంతరం లేవనెత్తుతున్న నేపథ్యంలో తొలుత ఆ విషయాన్ని తేల్చాలన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ ఇంప్లీడ్‌ పిటిషన్‌పై కౌంటర్‌ వేయాలని పేర్కొంటూ విచారణను వాయిదా వేశారు. దీంతో రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాది తీవ్ర అభ్యంతరం తెలిపారు. కౌలు అందక రైతులు ఆకలితో అలమటిస్తున్నారన్నారు.

Discrimination against capital farmers : రాజధాని రైతులపై కక్ష..! భూముల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.