అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ గుంటూరు జిల్లా తెనాలిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెనాలి ఇంఛార్జ్ చందు సాంబశివుడు, అమరావతి రాజకీయేతర ఐకాస నాయకులు మల్లికార్జునరావు, రాయపాటి శైలజ, తెనాలి జేఏసీ సభ్యులు, సీపీఐ నేతలు పాల్గొన్నారు.
సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని మార్చుకోవాలని... అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు.