ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు గుంటూరు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కలిసి కేక్ కట్ చేశారు. చంద్రబాబు వంటి మహా నాయకుని సేవలు ఏపీకే కాక, దేశానికి కూడా ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. సీఎం పని తీరు గుర్తించిన ప్రజలు ఎపీలో మరోసారి టీడీపీకే పట్టం కట్టనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు.. చంద్రబాబు పుట్టిన రోజుని పండగలా చేసుకుంటున్నారని అన్నారు.
గుంటూరులో ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు - nakka
చంద్రబాబు 69వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా తెదేపా అభిమానులు, కార్యకర్తలు వేడుకలు నిర్వహిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు గుంటూరు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కలిసి కేక్ కట్ చేశారు. చంద్రబాబు వంటి మహా నాయకుని సేవలు ఏపీకే కాక, దేశానికి కూడా ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. సీఎం పని తీరు గుర్తించిన ప్రజలు ఎపీలో మరోసారి టీడీపీకే పట్టం కట్టనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు.. చంద్రబాబు పుట్టిన రోజుని పండగలా చేసుకుంటున్నారని అన్నారు.
Body:కార్యక్రమంలో అరవింద బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో దొంగలందరూ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు. కానీ ప్రజలకు ఇష్టమైన వ్యక్తికి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడుకే నని తెలిపారు. ఆయన వల్లే రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ఆయనే మరలా ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. జరిగిన ఎన్నికల్లో 66 శాతం తెలుగుదేశానికి ఓట్లు పడ్డాయని, టీడీపీ150 సీట్లు పైనే విజయం సాధించి మరలా చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాబోతున్నారని అరవింద బాబు తెలిపారు.
Conclusion:కార్యక్రమంలో అరవింద బాబు కేక్ కట్ చేశారు. టీడీపీ కార్యకర్తలు, మహిళా నాయకులు, అభిమానులు చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052,
8500512909.