గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై మహిళను కత్తితో దాడి చేసి హతమార్చిన ఘటన పేటరు గ్రామంలో చోటు చేసుకుంది. పేటరు గ్రామ పంచాయతీ సమీపంలో డొక్కు నిర్మల అనే మహిళపై డొక్కు శ్రీనివాసరావును అనే వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. మెడ, గొంతు దగ్గర తీవ్రగాయలవ్వడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుకు రూరల్ సి ఐ అచ్చయ్య తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇవీ చదవండి