భాజపా నిరసన ధర్నాలో కన్నా జమ్మూకశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిని పిరికి పందల చర్య అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అమర జవాన్ల కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని చెప్పారు. మరోసారి కేంద్రం లక్షిత దాడులు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఉగ్రదాడికి నిరసనగా.. గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రదర్శన చేశారు.