సినిమా స్టూడియో కోసం విశాఖలో కేటాయించిన 300 ఎకరాల భూమిని ఎపీలో నివసించే నిర్మాతలకు మాత్రమే ఇవ్వాలని ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు అంబటి మధుమోహన్ కృష్ణ కోరారు. సినిమా షూటింగ్ల అంశంపై పలువురితో ఆయన తెనాలిలో సమావేశం నిర్వహించారు.
కాగితాలకే పరితమైన జీవోలను కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కేవలం15 సినిమాలకే సబ్సిడీని పరిమితం చేయాలనుకోవడం సముచితం కాదని వివరించారు. సబ్సిడీని రూ.10 లక్షల నుంచి 50 లక్షలకు పెంచాలని కోరారు.
ఇదీ చదవండి:
విద్యార్థుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా?: ఎమ్మెల్యే అనగాని