ETV Bharat / state

APERC ఇప్పటికే నాలుగు సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు.. వాటి సంగతేంటీ..? - విద్యుత్‌ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ

APERC SECOND DAY VIRTUAL MEETING: డిస్కమ్‌లు ప్రతిపాదించిన విద్యుత్ టారిఫ్ , వార్షికాదాయ వ్యయాలపై ఏపీఈఆర్సీ రెండో రోజూ వర్చువల్​గా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఏపీఈఆర్సీ బహిరంగ విచారణలో పౌరులు, పౌర సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇప్పటికే నాలుగు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన మాటేంటీ అని ప్రశ్నించాయి. రాష్ట్రప్రభుత్వం ఎంతమేర ప్రభుత్వం భరిస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్​ చేశారు.

APERC SECOND DAY VIRTUAL MEETING
APERC SECOND DAY VIRTUAL MEETING
author img

By

Published : Jan 20, 2023, 1:24 PM IST

APERC SECOND DAY VIRTUAL MEETING : డిస్కమ్‌లు ప్రతిపాదించిన విద్యుత్ టారిఫ్ , వార్షికాదాయ వ్యయాలపై ఏపీఈఆర్సీ రెండో రోజూ వర్చువల్​గా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్ పరిధిలో ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ చేపట్టింది. ఏపీఈఆర్సీ బహిరంగ విచారణలో పౌరులు, పౌర సంఘాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. రాష్ట్రంలో మూడు డిస్కమ్​లు రెవెన్యూ లోటు రూ.12,792 కోట్లు చూపించాయని, ఈ మొత్తంలో ఎంతమేర ప్రభుత్వం భరిస్తుందో స్పష్టం చేయాలని, ఆ తర్వాతే టారిఫ్ ప్రకటించాలని సీఐటీయూ నేత సీహెచ్ నర్సింగరావు డిమాండ్‌ చేశారు.

విద్యుత్ ప్రస్తుతం నిత్యావసర సరుకుగా మారిందని.. దీన్ని దృష్టిలో పెట్టుకునే డిస్కమ్​లు వ్యవహరించాలన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగింపు సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అప్పుల్లో ఉండి వేల కోట్ల రూపాయలతో స్మార్ట్ మీటర్లు కొని బిగించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. హెచ్​టీ కనెక్షన్లకు..యూనిట్​కు అదనంగా 1.45 రూపాయల పెంచటం వల్ల కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉంటుందన్నారు. ఈ పరిణామం వల్ల ప్రత్యక్షంగా కొన్ని ఎంఎఎస్ఎంఈలు మూతపడి కార్మికులు ఉద్యోగాలు కోల్పోతారని తెలిపారు.

విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన ప్రస్తుత ప్రభుత్వం.. ఇప్పటికే నాలుగు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిదని సీఐటీయూ నేత మురళి తెలిపారు. 2300 కోట్ల రూపాయల మేర ట్రూ అప్ ఛార్జీల పేరుతో వినియోగదారులపై భారం మోపారన్నారు. జెన్‌కో ప్రాజెక్టు అదానీకి అప్పగించకుండా ఉండాలని కోరుతూ ఆందోళన చేస్తున్నారని.. దీన్ని ఈఆర్సీ పరిగణనలోకీ తీసుకోవాలని కోరారు. డిస్కమ్​లు అప్పుల పాలు కావడానికి కారణం ప్రభుత్వమే అని.. మళ్లీ ఆ భారాన్ని ప్రజలపైనే వేస్తారా అని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్ల పేరిట 15 ఏళ్లకు 36 వేల కోట్ల భారాన్ని వినియోగదారులపై వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మురళి అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.