AP CID Notices to Lokesh: రెడ్ బుక్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఏపీ సీఐడీ నోటీసులు అందించింది. రెడ్ బుక్ పేరుతో లోకేశ్ తమను బెదిరిస్తున్నాడని ఏపీ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. లోకేశ్ అరెస్టుకు ఆదేశాలు ఇవ్వాలని ఏసీబీ కోర్టును కోరిన విషయం తెలిసిందే.
సీఐడీ అధికారులు లోకేశ్‌కు రెడ్ బుక్ అంశంలో నోటీసులు అందించారు. ఈ అంశంలో వారు కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం సూచనల మేరకు సీఐడీ నోటీసులు పంపించింది. వాట్సాప్‌లో నోటీసులు అందుకున్న లోకేశ్, వాట్సప్‌లోనే నోటీసులు అందుకున్నట్లు తిరిగి వారికి సమాధానామిచ్చారు. ఈ కేసు విచారణను ఇప్పటికే ఏసీబీ కోర్టు జనవరి 9వతేదీకి వాయిదా వేసింది.
నారా లోకేశ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు నోటీసులు
అసలేంటీ ఈ రెడ్ బుక్ కథ: లోకేశ్ యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆరోపించారు. యాత్ర ప్రారంభం నుంచి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ, తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేస్తూ ఇబ్బంది పెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండదండలతోనే పోలీసులు ఈ చర్యకు పూనుకున్నారని వారిని ఊరికే వదిలిపెట్టబోనని లోకేశ్ గతంలోనే వ్యాఖ్యనించారు. ఈ క్రమంలోనే అడ్డంకులు సృష్టించిన వారి పేర్లను రెడ్‌బుక్‌లో రాసుకుంటున్నానని ఆయన వెల్లడించారు.
బీసీలకు ప్రత్యేక చట్టం - అందరికీ అండగా ఉంటాం : నారా లోకేశ్
రెడ్‌బుక్‌లో నమోదు చేసుకున్న పేర్లు గల అధికారులను, టీడీపీ అధికారంలోకి రాగానే బదులు చెప్తానంటూ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పేర్లు నమోదు చేసుకున్న రెడ్‌బుక్ ఇదేనంటూ యువగళం ముగింపు సభలో ఓ పుస్తకాన్ని చూపించారు. తెలుగుదేశానికి అడ్డంకులు సృష్టిస్తున్న వారిని టీడీపీ అధినేత చూసీ చూడనట్లు వ్యవహరించినా తాను మాత్రం వదిలే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు.
సీఐడీ చర్యలకు ప్రతిపక్షాల మండిపాటు : లోకేశ్ రెడ్‌బుక్ అనగానే సీఐడీ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై ప్రతిపక్షాలు మండిపడ్తున్నాయి. అసలు రెడ్‌బుక్ అంశం ఏంటీ, ఆయన అందులో ఎవరి పేర్లు రాసుకున్నారనది తెలుసుకోకుండానే సీఐడీ ఇలా వ్యవహరిస్తోదంటున్నారు. అందులో లోకేశ్ ఏం రాశారు, ఎంటో తెలియకుండా వారు అలా వ్యవహరించడంపై ఏదో కుట్ర కోణం దాగుందని అంటున్నాయి.
స్పందించిన డీజీపీ : లోకేశ్ ప్రస్తావించిన రెడ్ బుక్‌పై రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. రెడ్‌బుక్ అనేది ఎవరు ఎవరికైనా ఇవ్వొచ్చని స్పష్టం చేశారు.