ETV Bharat / state

Mukesh Kumar Meena: 10లక్షల ఓట్లు తొలిగించినా ఒక్క ఫిర్యాదు రాలేదు.. ఎందుకంటే: ముఖేష్​ కుమార్​ మీనా

author img

By

Published : Jun 20, 2023, 11:44 AM IST

AP CEO Mukesh Kumar Meena Comments: రాష్ట్రంలో 10లక్షల ఓట్లను తొలగిస్తే ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్​ కుమార్​ మీనా తెలిపారు. ఎన్నికలు రానున్న తరుణంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఓటర్ల జాబితా విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

AP CEO Mukesh Kumar Meena Comments
AP CEO Mukesh Kumar Meena Comments
10లక్షల ఓట్లు తొలిగించినా ఒక్క ఫిర్యాదు రాలేదు

AP CEO Mukesh Kumar Meena Comments: ప్రతి ఏడాది ఓటర్ల జాబితా ప్రకటించే సమయంలో సాధారణంగా ఓటర్లలో 1 శాతం పెరుగుదల ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి నిర్దేశిత సంఖ్యలో ఓటర్లు ఉండాలని.. కానీ ఏపీలో 3నుంచి 4 శాతం మేర పెరుగుదల ఉందన్నారు. అందుకే ఒకే ఫోటోతో ఉన్న ఓటర్లను ప్రత్యేక సాఫ్ట్​వేర్ ద్వారా 15 లక్షల మందిని గుర్తించినట్లు వెల్లడించారు. 2022వ సంవత్సరంలో దాదాపు 10 లక్షల మందిని గుర్తించి తొలగించామన్నారు. పూర్తిగా ఓటర్లను తగ్గించలేదని.. ఎక్కువగా నమోదైన డూప్లికేట్ ఓట్లను మాత్రమే తొలగించినట్లు వివరించారు.

అదే ఎన్నికల సంఘం ప్రధాన ఉద్దేశం: ఓట్ల తొలగింపుపై చాలా కథనాలు వచ్చాయని.. కానీ దాని వెనుక కచ్చితమైన కారణాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత డేటా ప్రకారం పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగించటం అన్నది అవాస్తవమన్నారు. ఓటర్ల జాబితాను సవ్యంగా రూపొందించాలన్నదే ఎన్నికల సంఘం ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రంలో 1.62 కోట్ల ఇంటి నెంబర్లు ఉన్నాయని.. వాటిలో 3.98 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. 50 కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఇంటి నెంబర్లు 2వేల 100 వరకూ ఉన్నాయని.. ప్రతి ఇంటి డోర్ నెంబరూ తనిఖీ చేయాల్సిందిగా ఆదేశాలు కూడా ఇచ్చినట్లు చెప్పారు. ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ఉండొచ్చని, అలాగే కావాలని చేసినవి కూడా ఉండొచ్చని వ్యాఖ్యానించారు.

అక్టోబర్​ 15 నాటికి తదుపరి ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోనూ ఈ తరహాలోనే జరిగిందని భావిస్తున్నట్లు వెల్లడించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో కావాలని ఓట్లు తొలగించిన ఇద్దరు బీఎల్ఓలను కూడా సస్పెండ్ చేశామన్నారు. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు అయ్యేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను ఎన్నికల సంఘం జారీ చేసిందని గుర్తు చేశారు. అక్టోబర్ 15 నాటికి తదుపరి ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. ఆ సమయానికి ఈ తరహా పొరపాట్లు లేకుండా జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. పది లక్షల డూప్లికేట్ ఓట్లను తొలగించిన సమయంలో ఒక్క ఫిర్యాదు కూడా ఈసీకి రాలేదని.. అవన్నీ డూప్లికేట్ ఓట్లు కాబట్టే ఫిర్యాదులు రాలేదన్నారు. ఎన్నికలు రానున్న తరుణంలో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటామని పేర్కొన్నారు. ఓటరు కార్డుకు ఆధార్ కార్డును ఇంకా జత చేయలేదని.. కేవలం ఆధార్ సమాచారం మాత్రమే తీసుకున్నామని వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.