ETV Bharat / state

'అపెక్స్ భేటీలో రాష్ట్ర ప్రయోజనాలపై దీటుగా స్పందించండి'

మంగళవారం జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రప్రయోజనాలపై గట్టిగా స్పందించాలని ఏపీ ప్రభుత్వాన్ని భాజపా రాష్ట్ర నాయకత్వం కోరింది. గత ఆరేళ్లుగా తెలంగాణ అనేక ప్రాజెక్టులు చేపట్టిందని, గత ప్రభుత్వాలు వాటిపై నోరు మెదపలేదని తెలిపింది. తెలంగాణ ప్రాజెక్టులపై దీటుగా స్పందించాలని కోరింది. రాయలసీమ అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్ అంశాన్ని సమావేశంలో చర్చించాలని కోరింది. రాష్ట్రం విడిపోయాక కూడా ఆంధ్రులపై కేసీఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంది.

Ap bjp
Ap bjp
author img

By

Published : Oct 5, 2020, 4:21 PM IST

తెలుగు రాష్ట్రాల నదీ జలాల వివాదాలపై చర్చించేందుకు మంగళవారం దిల్లీలో అపెక్స్ కౌన్సిల్​ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రప్రయోజనాలపై.. ఏపీ ప్రభుత్వం గట్టిగా స్పందించాలని భాజపా రాష్ట్ర న్యాయకత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై దీటుగా స్పందించాలని కోరింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్​ నీటి విషయాలపై అవగాహన పెంచుకున్నారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తులే ఎక్కువగా నీటిపారుదలశాఖ మంత్రులుగా పని చేశారని గుర్తు చేసింది.

Ap bjp
భాజపా ప్రకటన
Ap bjp
భాజపా ప్రకటన

గత ఆరేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం పలు ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నా...అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్​ మోహన్​ రెడ్డి ఇద్దరూ నోరు మెదపలేదని విమర్శించింది. ప్రస్తుతం కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి మధ్య స్నేహపూరిత వాతావరణం ఉన్నందున...పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమకు నీటిని తీసుకెళ్లే విషయంపై చర్చించాలని భాజపా...రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది.

కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదు

రాష్ట్రం విడిపోయాక కూడా ఆంధ్రుల మీద, కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఏపీ భాజపా ఖండించింది. ఉభయ ప్రాంతాలకు నష్టం జరగకుండా జల వివాదాలను పరిష్కరించాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్​ని అభ్యర్థిస్తున్నట్లు తెలిపింది.

రాయలసీమలో నికర జలాలు లేని కారణంగా ఆంధ్రప్రదేశ్ మరొక ధాన్యాగారాన్ని కోల్పోతుందని భాజపా అభిప్రాయపడింది. రాయలసీమకు సరైనా తాగు, సాగు కేటాయింపులు జరగాలని డిమాండ్ చేసింది. ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఉండరాదని... అన్ని రాష్ట్రాల అభివృద్ధే భాజపా విధానమని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

దిల్లీకి సీఎం జగన్.. రేపు అపెక్స్​ కౌన్సిల్ భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.