ETV Bharat / state

ఎల్లుండి అసెంబ్లీ ప్రత్యేక భేటీ..అధికారుల ప్రత్యేక చర్యలు

author img

By

Published : Jan 18, 2020, 12:30 PM IST

అసెంబ్లీ ప్రత్యేక భేటీకి వచ్చే ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగలకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు వచ్చే మార్గంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు. కృష్ణాయపాలెం నుంచి అసెంబ్లీకి వెళ్లే రహదారిని పునరుద్ధరిస్తున్నారు.

ap-assembly-meeting-in-ap
ap-assembly-meeting-in-ap
ప్రత్యేక అసెంబ్లీ భేటీకి నిరసన సెగ తగలకుండా జాగ్రత్తలు

రాజధాని వికేంద్రీకరణపై ప్రభుత్వం నిర్వహించే ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యే ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగలకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం నుంచి అసెంబ్లీకి వెళ్లే మార్గాన్ని పునరుద్ధరిస్తున్నారు. శాసనసభ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేల కోసం గత ప్రభుత్వం ఈ రహదారిని నిర్మించింది. రాజధానిలో అంతర్గత రహదారుల నిర్మాణం కోసం ఈ రోడ్డు కింద వంతెన పనులు చేపట్టారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రహదారిని మరమ్మతుల పేరుతో మూసేశారు. ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆందోళన దృష్ట్యా ఈ మార్గాన్ని తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే మంత్రులు, ఎమ్మెల్యే లకు అమరావతి రైతుల సెగ తగలకుండా ఈ రహదారి నుంచి తరలించవచ్చని అధికారులు నిర్ణయించారు. ఈ తరుణంలో గత రెండ్రోజులుగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.

Intro:AP_GNT_26_18_ALTERNATE_ROAD_MLAS_AV_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

(. ) రాజధాని వికేంద్రీకరణపై ప్రభుత్వం నిర్వహించే ప్రత్యేక శాసనసభ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలకు రైతుల నిరసన సెగ తగలకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మంగళగిరి మండలం కృష్ణాయ పాలెం నుంచి సచివాలయానికి వెళ్లి రహదారిని పునరుద్ధరించనున్నారు. శాసనసభ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలు కోసం గత ప్రభుత్వం ఈ రహదారిని నిర్మించింది. రాజధానిలో అంతర్గత రహదారుల నిర్మాణం కోసం ఈ రోడ్డుపై కింద వంతెన పనులు చేపట్టారు. రహదారి మధ్యలో వంతెన కోసం తవ్వారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రహదారిని మరమ్మతుల పేరుతో మూసేశారు. రోడ్డుకు అడ్డంగా మట్టి వేసి రాకపోకలు నిషేధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆందోళన దృష్ట్యా ఈ రహదారిని తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. శాసనసభ సమావేశాలకు హాజరై మంత్రులు ఎమ్మెల్యేలకు రాజధాని రైతుల సెగ తగలకుండా ఈ రహదారి నుంచి తరలించవచ్చని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా ఈ రహదారిలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అయితే ఈ రహదారిపై ఇంకా పెద్ద పెద్ద గోతులు.... కొంచెం దూరం తారు రోడ్డు..... మరికొంత దూరం మట్టి దారిపై...... వాహనాలు ప్రయాణించాల్సి ఉంది. తగినంత భద్రత చర్యలు తీసుకుంటే తప్ప దీనిపై ప్రయాణించేందుకు అనుమతి ఇవాళ వద్దని అధికార వర్గాలు ఆలోచిస్తున్నాయి.

Body:viss

Conclusion:only
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.