ETV Bharat / state

అనుష్క పంటచేలకొచ్చింది... ఎందుకబ్బా!

author img

By

Published : Aug 16, 2019, 5:24 AM IST

'ఏడవకురా.. అప్పు చేసి కొన్నాను'... తరుచుగా ఈ డైలాగ్​ వాహనాలపై కన్పిస్తుంది. కానీ ఓ రైతు ఇంకో అడుగు ముందుకేసి ముద్దుగుమ్మల బొమ్మలతో పంట పొలాల్లో ఫ్లెక్సీలు అమర్చాడు. ఇదేంటని అడిగితే..' అటొచ్చే వాళ్లంతా... వాటివైపే చూస్తారు... దిష్టి తలగదు కదా!'అని వ్యంగంగా..సమాధానమిస్తున్నాడు.

అనుష్క పంటచేలకొచ్చింది... ఎందుకబ్బా!

దొండసాగులో అనుష్క ఫ్లెక్సీ పెట్టాడెందుకు..!

హీరోయిన్​ అనుష్క గుంటూరు జిల్లా పంటపొలాల్లో కనపడుతోంది. కొంపదీసి వ్యవసాయం చేస్తుందనుకునేరు. ఫ్లెక్సీల రూపంలో పంటకు దిష్టి తలక్కుండా కాపలకాస్తోంది. పెదలంక గ్రామానికి చెందిన ఓ రైతు... ఆ ఫొటోల కింద తనదైన రీతిలో డైలాగ్స్​ రాయించి చూపరుల్నీ ఆశ్చర్య పరిచాడు. 'ఏడవకురా..అప్పుచేసి వేశాను..'అంటూ హస్యస్పదంగా ప్రింట్​ చేయించాడు. అదేంటని ప్రశ్నిస్తే 'ఆమెవరో కూడా తెలీదు..దారిలో పోయే వాళ్లు ఆ ఫ్లెక్సినే చూస్తారు కదా..దొండసాగుకు దిష్టి తలగదు..'అంటూ అమాయకంగా సమాధానమిస్తున్నాడు. బెల్లంకొండ మండలం వెంకటపాలెంలోనూ.. ఓ రైతు ఇలాగే పత్తిపంటలో సినీనటి చిత్రాన్ని ఏర్పాటు చేశాడు. ఇదీ ఓ రకం రక్షణే మరి..!

ఇవీ చదవండి..'నిశ్శబ్దం'గా షూటింగ్ ముగించిన అనుష్క

Contributor :R.SampathKumar center : Guntakal Dist:- ananthapur Date : 15-08-2019 Slug:AP_Atp_22_15_bhari_varsham_colony_wtr_Avb_ap10176 anchor:-గుత్తి లో భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో గురువారం సాయంకాలం భారీ వర్షం కురవడంతో లోతట్టు,ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో డ్రైనేజీ మురికి నీళ్లు లోతట్టు ప్రాంతాలతో పాటు రోడ్డుపైకి రావడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ లోనికి డ్రైనేజీ మురికి నీరు మోకాళ్ళ లోతు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా చేయాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షానికి ఇలా మురికి నీళ్లు రావడం ఏమిటని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.