గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో నిన్న కారు-అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో మరొకరు మృతి చెందారు. ఈపూరికి చెందిన పూర్ణచంద్రరావు కరోనాతో గుంటూరులో మృతి చెందారు. ఈ క్రమంలో అతని మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వస్థలానికి తరలింస్తుండగా.. గుంటూరు వైపుగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లోని కోటేశ్వరరావును ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడగా.. ఈరోజూ వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. మృతుడు గుంటూరుకు చెందిన మహాలక్ష్మయ్య అని చెప్పారు.
ఇదీ చదవండీ.. రెండు ప్రభుత్వ ఆసుపత్రులకు కాయకల్ప అవార్డు