గుంటూరు జిల్లా మంగళగిరి శ్రీలక్ష్మి నరసింహ స్వామి గిరి ప్రదర్శన పనుల్లో ఆంజనేయస్వామి విగ్రహం బయటపడింది. శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయం గిరి ప్రదర్శన కోసం మంగళగిరి కొండ వద్ద ఆదివారం పనులకు శంకుస్థాపన చేశారు. సోమవారం నుంచి విస్తృతంగా పనులు చేపట్టగా.. మంగళవారం ఉదయం రహదారి కోసం తవ్వుతుండగా ఆంజనేయ స్వామి విగ్రహం బయటపడింది. సమాచారం తెలుసుకున్న ఆలయ అర్చకులు అక్కడకు చేరుకొని పూజలు నిర్వహించారు.
ఇవీ చూడండి...