అధికారులు మెమో ఇచ్చారని మానసిక వేదనకు గురైన ఓ అంగన్‌వాడీ టీచర్.. ఆత్మహత్యకు పాల్పడినట్లు గుంటూరు నగరంలోని అరండల్‌పేట ఠాణాలో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. వినుకొండ మండలం జద్దవారిపాలేనికి చెందిన మేరి కుమారి (40) అంగన్‌వాడీ టీచర్. ఆమె భర్త లింగారావు పాస్టర్‌గా పని చేస్తున్నారు. మొదటి భార్య మృతి చెందడంతో.. మేరి కుమారిని ఆయన రెండో వివాహం చేసుకున్నారు. చిన్నతనం నుంచి ఆమెకు మూర్ఛ వ్యాధి ఉంది.
ఇదీ చదవండి: కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు పరిహారం!
గత కొన్ని నెలలుగా ఆమె విధులకు గైర్హాజరయ్యారు. దీంతో అధికారులు ఆమెకు మెమో ఇచ్చారు. ఫలితంగా మనస్థాపానికి గురైన ఆమె భారత్‌పేటలో నివాసముంటున్న అక్క లోకేశ్వరి వద్దకు 10 రోజుల క్రితం వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటోంది. అనూహ్యంగా సోమవారం ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు ఈ విషయాన్ని ఆమె భర్తకు తెలియజేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: సోషల్ మీడియాలో పోస్టు..తెదేపా కార్యకర్త అరెస్టు