Anganwadi Strike Across the State: మంగళవారం నుంచి అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె బాట పట్టనున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గత కొద్దికాలంగా అంగన్వాడీలు ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. అంగన్వాడీల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం వారి సమస్యలపై చర్చలకు ఆహ్వానించింది. రాష్ట్ర ప్రభుత్వంతో అంగన్వాడీల చర్చలు విఫలం అవ్వడంతో, మంగళవారం నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సంఘం నాయకులు వెల్లడించారు. మూడు ప్రధాన సంఘాలు సమ్మె చేపట్టనునున్నట్లు వెల్లడించాయి. వేతనాల పెంపు, గ్రాట్యుటీ తదితర డిమాండ్లపై సమ్మెకు వెళ్లనున్నట్లు అంగన్వాడీ నేతలు తెలిపారు. మంగళవారం నుంచి అన్ని అంగన్వాడీ సెంటర్ల మూసివేయనున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టాలని అంగన్వాడీ నేతలు పిలుపునిచ్చారు.
అంగన్వాడీల డిమాండ్స్: తమ సమస్యలు పరిష్కరించకపోతే, రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు వెళ్తామని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సంఘం నాయకులు తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్‌ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలనే డిమాండ్‌తో సమ్మె చేస్తామన్నారు. మరణించిన అంగన్వాడీలకు 5 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని, ఫేస్ యాప్ లను రద్దు చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించాలని, హామీలు అమలు చేయాలని, అనేకసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఎటువంటి స్పందన అంగన్వాడీ నేతలు తెలిపారు.
జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను మర్చిపోయాడు - డిసెంబర్ 8నుంచి నిరవధిక సమ్మె : అంగన్వాడీ వర్కర్స్
Anganwadi Workers Protest In andhrapradesh : అధికారులకు ఎన్ని సార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని తెలిపారు. పనిభారం పేరుతో... అందించాల్సిన నాణ్యమైన సరుకులు అందించడం లేదని వాపోయారు. అంగన్వాడీ వర్కర్ల విషయంలో రాజకీైయాలు అధికంగా ఉన్నాయని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సంఘం నాయకులు ఆరోపించారు.
సెప్టెంబర్ 25న మహాధర్నాకు పిలుపు ఇచ్చిన అంగన్వాడీ వర్కర్స్,హెల్పర్స్ యూనియన్లు
Anganwadis Chalo Vijayawada: సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్‌లో అంగన్వాడీలు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. విజయవాడలో అడుగు పెట్టనివ్వకుండా.. వివిధ ప్రాంతాల్లో అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. వివిద మార్గాల్లో విజయవాడ వచ్చిన వారిని కూడా అరెస్టు చేసి.. స్టేషన్లకు తరలించారు. హక్కుల సాధన కోసం పోరాడుతున్న తమపై ప్రభుత్వం నిర్బంధకాండ ప్రదర్శించడం పట్ల అంగన్వాడి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడ ధర్నాకు వచ్చిన అంగన్వాడీలను బస్టాండ్, రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు అరెస్టు చేసి.. ప్రైవేటు కల్యాణ మండపాలకు తరలించారు. పోలీసుల తీరుపై మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.