ETV Bharat / state

Anarchies on Dalits: అధికార వైఎస్సార్​సీపీ పాలనలో.. దళిత, గిరిజనులపై అరాచకాలు.. నెలకు ముగ్గురి హత్య - మానవ హక్కుల ఉల్లంఘన

Anarchies increased on Dalit in AP: వైఎస్సార్​పీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. వీటిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. దాడులు, హత్యలు, అత్యాచారాలు ఏదో విధంగా దళితులు, గిరిజనులు బాధితులు అవుతూనే ఉన్నారు. ఈ చర్యలపై కఠినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం కనీసం కన్నెత్తైనా చూడటం లేదు.

Anarchies on Dalits in AP
ఎస్సీ, ఎస్టీలపై ఏపీలో దాడులు
author img

By

Published : Jun 27, 2023, 8:28 AM IST

జగన్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీలే లక్ష్యంగా దమనకాండ

Anarchies Increased on SC,ST People in YSRCP Government in AP జగన్‌ పాలనలో రాష్ట్రంలో ఎస్సీ-ఎస్టీలు దారుణమైన అణచివేతకు, హింసకు గురవుతున్నారు. నెలకు ముగ్గురు ఎస్సీ-ఎస్టీలు హత్యగావించబడుతున్నారు. వారానికి నలుగురు దళిత, గిరిజన మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. సగటున రోజులు 7 దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అధికార వైఎస్సార్​సీపీ నాయకులే దళితులు, గిరిజనులపై ఈ దమనకాండకు పాల్పడుతున్నారు. 2021లో నమోదైన కేసులపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికే ఈ గణాంకాలను తేటతెల్లం చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఇటీవల పేదలు, పెత్తందార్లు అంటూ కొత్త పలుకులు అందుకున్నారు. అంబేడ్కర్‌, జ్యోతిబూ ఫులే, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు తరహాలో జీవితాన్ని పణంగా పెట్టి పేదలకు సేవ చేశానన్నట్లు బీరాలు పలుకుతున్నారు. పార్టీ నేతలకు నాలుగు రాజకీయ పదవులిచ్చి అదే పేదలందరికీ చేసిన గొప్ప సామాజిక న్యాయమనేలా మాట్లాడుతున్నారు.

మరోవైపు రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా దళితులు, గిరిజనులపై అరాచకాలు పెరిగిపోయాయి. దళితుణ్ని చంపి డోర్‌ డెలివరీ చేయడం, మాస్కు అడిగిన కారణంగా వైద్యుడ్ని మానసికంగా క్షోభపెట్టి ప్రాణాలు వదిలేలా చేయడం, అధికార పార్టీ నాయకుల ఇసుక అక్రమాలను ప్రశ్నించినందుకు దళిత యువకుడికి.. పోలీస్‌ స్టేషన్‌లోనే శిరోముండనం చేయడం, మాస్కు పెట్టుకోలేదని మరో దళిత యువకుణ్ని లాఠీలతో చితకబాది చావుకు కారణం కావడం వంటి అసాధారణ దౌర్జన్యాలు ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్నా దాడులకు ఉదాహరణలు మాత్రమే. ముఖ్యమంత్రి మాత్రం వాటి ఊసే ఎత్తకుండా.. దళిత దీనజనోద్ధారకునిలా పదే పదే ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అనే మంత్రాన్ని జపిస్తున్నారు. నాలుగు సంవత్సరాల వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధికి ప్రత్యేకంగా చేసిందేమీ లేకున్నా గొప్పలు మాత్రం చెబుతున్నారు.

ముఖ్యమంత్రిగా జగన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు సమాజాన్ని నిర్ఘాంతపరుస్తున్నాయి. దేశంలో మరే రాష్ట్రంలోనూ చేయని విధంగా వైఎస్సార్​సీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు మేలు చేస్తోందంటూ మంత్రులు ఎగిరెగిరి పడుతున్నా.. ఆయా వర్గాల భద్రత గాలిలో దీపంలా మారిందనేది నగ్న సత్యం. రాష్ట్రంలో సగటున రోజుకు ఎస్సీ, ఎస్టీలపై 7 దాడులు, అఘాయిత్యాలు, అరాచకాలు జరుగుతున్నాయి. వారానికి సగటున నలుగురు ఎస్సీ, ఎస్టీ మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. నెలకు సగటున ముగ్గురు దళితులు, గిరిజనులు హత్యకు గురవుతున్నారు. 2021లో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన అమానుషాలపై సాక్షాత్తూ సాంఘిక సంక్షేమశాఖ 1339467/సీవీ.పీవోఏ/2021 నంబర్‌తో 2022 జులై 5న కేంద్రానికి లేఖ రాసింది. 2019, 2020, 2021ల్లో ఎస్సీ, ఎస్టీలపై జరిగిన దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు, అరాచకాలపై ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసుల్ని అందులో నివేదించింది. ఇవి కాకుండా పోలీసుల దృష్టికి రానివి, వచ్చినా కేసులు నమోదు కానివి మరెన్నో!.

2019లో ఎస్సీ, ఎస్టీలపై వివిధ ఘటనలకు సంబంధించి 2 వేల 727 కేసులు నమోదయ్యాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఏడాది 2018తో పోలిస్తే 2019లో ఎస్సీ, ఎస్టీలపై దాడులు, అఘాయిత్యాలు 9 శాతం పెరిగాయి. ఇది వైఎస్సార్​సీపీ ప్రభుత్వం అధికారికంగా చెబుతున్నదే. తర్వాత కరోనా కారణంగా లాక్‌డౌన్లతో ప్రజలు బయటికి రాకపోవడంతో 2019తో పోల్చితే 2020లో కేసులు 8.7 శాతం తగ్గాయి. ఆ ఏడాది 2 వేల 375 కేసులు నమోదయ్యాయి. 2021 నాటికి ఇలాంటి ఘటనలు అమాంతం 14 శాతం పెరిగి 2 వేల 717కి చేరాయి. ఎస్సీ-ఎస్టీలపై దాడులు, అత్యాచారాలను అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. బాధితులు, సాక్షులకు రక్షణ కల్పించాల్సిందిపోయి.. నిందితులను కాపాడేలా పాలకులు, పోలీసులు వ్యవహరించడం... నేరాలకు మరింత ఊతమిచ్చేలా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు అరాచాకలకు సంబంధించిన కేసులను పరిష్కారించటంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసుల్లో 60 రోజుల్లోనే ఛార్జిషీటు దాఖలు చేయాలని చట్టం చెబుతున్నా.. చాలా వరకు అనేక కేసుల్లో ఈ నియామం అమలు కావడం లేదు. ఈ కేసుల విచారణలోనూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా బయటపడింది. వైసీపీ మూడు సంవత్సరాల పాలనలో నేర నిరూపణ జరిగి శిక్ష పడినవి మొత్తం 91 కేసులే కావడం ఇందుకు నిదర్శనం. సరైన ఆధారాలు సేకరించడంలో విఫలమవడంతో 13 వందల 26 కేసులు వీగిపోయాయి. కొన్ని కేసుల్లో నేర నిరూపణకు తగిన ఆధారాలు సేకరించలేదని, మరికొన్నింటిలో శాస్త్రీయ ఆధారాలు సేకరించకపోవడమూ ఇందుకు కారణాలని పేర్కొంది. కేసులు వీగిపోవడానికి పోలీసులు సక్రమంగా విచారణ చేపట్టకపోవడం కారణమేనని అంగీకరించింది. మెజారిటీ కేసుల్లో సాక్షులు నిలబడకపోవడం వల్లే వీగిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. సాక్షులకు ధైర్యమిచ్చి బాధితుల పక్షాన ప్రభుత్వం పోరాడకపోవడం వల్లే కేసులు నిలబడటం లేదని ఎస్సీ, ఎస్టీ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

"నిర్లక్ష్య ధోరణి వల్లే చట్టంలో చేసిన నియామ నిబంధనలను అమలు చేయకపోవటం వల్లనే.. ఈ రోజు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరుగుతున్నాయి. దీనికి నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం" -కొరివి వినయ్‌కుమార్‌, దళిత బహుజన ఫ్రంట్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు

రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై ఇంత తీవ్రస్థాయిలో నేరాలు జరుగుతుంటే నియంత్రించాల్సిన సీఐడీ ఆ విధులు వదిలేసి.. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లుగా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే పరమావధిగా వ్యవహరిస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘన, కస్టడీ హింస, ఎట్రాసిటీ కేసుల్లో సరైన దర్యాప్తు జరిగేలా చూడటం, నిందితులకు శిక్షలు పడేలా చేయటం తదితరాల కోసం సీఐడీలో ప్రత్యేకంగా పౌర హక్కుల పరిరక్షణ విభాగం ఏర్పాటు చేశారు. సీఐడీ విభాగాధిపతి నేతృత్వంలో.. డీఐజీ స్థాయి అధికారి ఈ విభాగం బాధ్యతలు చూసుకుంటారు. దళిత, గిరిజనులపై జరిగే దాడులు, వారిపైన వేధింపులకు సంబంధించిన ముఖ్యమైన కేసులు దర్యాప్తు చేయటం, స్థానిక పోలీసులు సరిగా దర్యాప్తు చేయని కేసుల బాధ్యతలు తీసుకుని వాటిని కొలిక్కి తీసుకురావటం వంటివి ఈ విభాగం ప్రధాన బాధ్యతలు. అయితే సీఐడీ వీటిని వదిలేసి అధికార పార్టీ నేతల సేవలో తరించిపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

"దళితులపై జరిగే దాడులలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నాయి. దానిని రూపుమాపటం కోసం.. దాడులకు పాల్పడుతున్న వారిని శిక్షించటంలో ప్రభుత్వం లోపాభూయిష్టంగా ఉంటోంది. జగనన్న కాలనీల పేరుతో భూములను లాక్కుంటున్నారు. దళితులకు ఉన్నవే కొద్ది భూములు. వాటిని కాపాడాల్సిన ప్రభుత్వం.. భూములను ఇవ్వకపోగా లాగేసుకుంటోంది."-ఆండ్ర మాల్యాద్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎట్రాసిటీ కేసుల పెండింగ్‌ భారీగా పెరిగిపోతోంది. వైసీపీ అధికారంలోకి రాకముందు అంటే.. 2019కి ముందుతో పోలిస్తే 2021 చివరి వరకు పెండింగ్‌ కేసులు 66.25% పెరిగాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.