ETV Bharat / state

'హైకోర్టు తాజా నిర్ణయం వైకాపా ప్రభుత్వానికి చెంపపెట్టు' - వైకాపా ప్రభుత్వంపై అనగాని సత్యప్రసాద్ విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 13ను హైకోర్టు వాయిదా వేయడం ద్వారా ప్రభుత్వ నిర్ణయాలు ఎంత అనాలోచితమో, ఏకపక్షమో స్పష్టమైందని... తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. వైకాపా 10 నెలల పాలనలో భవనాల రంగులు మార్చడం తప్ప చేసిందేమీ లేదని ఆరోపించారు.

anagani satyaprasad criticises cm jagan
అనగాని సత్యప్రసాద్
author img

By

Published : Mar 20, 2020, 7:43 PM IST

anagani satyaprasad criticises cm jagan
అనగాని సత్యప్రసాద్ లేఖ

విజిలెన్స్ కమిషన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలను కర్నూలుకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు ఉత్తర్వులు సీఎం జగన్ నిరంకుశత్వానికి చెంపదెబ్బ అని... రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 13ను వాయిదా వేయడం ద్వారా ప్రభుత్వ నిర్ణయాలు ఎంత అనాలోచితమో, ఏకపక్షమో స్పష్టమైందని దుయ్యబట్టారు. పీపీఏల రద్దు మొదలు రాజధాని భూముల్లో ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం వరకు వరుసగా హైకోర్టు చేత మొట్టికాయలు వేయించుకుంటూనే ఉన్నారని ఎద్దేవా చేశారు.

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 50కి పైగా వ్యతిరేక తీర్పులు వచ్చాయని గుర్తుచేశారు. వైకాపా 10 నెలల పాలనలో భవనాల రంగులు మార్చడం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. బీసీలకు రాజ్యాధికారం దక్కితే ఎక్కడ తనను ప్రశ్నిస్తారోనన్న భయంతోనే స్థానిక సంస్థల్లో వారి రిజర్వేషన్ల గురించి సుప్రీంకోర్టుకు వెళ్లలేదని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలు నిరంకుశత్వ వైఖరి ప్రదర్శిస్తే కుదరదని... ప్రజామోదం లేని నిర్ణయాలకు చీవాట్లు తప్పవని చెప్పడానికి హైకోర్టు తాజా నిర్ణయం నిదర్శనమన్నారు.

ఇవీ చదవండి.. కరోనా ఎఫెక్ట్: తిరుగిరులు నిశ్శబ్దం...దర్శనాలు నిలిపివేత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.