ETV Bharat / state

'హెల్పింగ్ సోల్జర్స్' ఆధ్వర్యంలో మృతదేహానికి అంత్యక్రియలు - తెనాలి కొవిడ్ వైద్యశాల తాజా సమాచారం

గుంటూరు జిల్లా తెనాలిలోని కొవిడ్​ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ వృద్ధరాలు మృతి చెందింది. ఆ మృతదేహాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో స్థానిక స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్​ సోల్జర్స్​ యువకులు అంత్యక్రియలు నిర్వహించారు.

died
మృత దేహం
author img

By

Published : May 13, 2021, 1:45 PM IST

గుంటూరు జిల్లా తెనాలిలోని కొవిడ్ వైద్యశాల ప్రాంగణంలో అనారోగ్యంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఆమెకు స్థానిక హెల్పింగ్ సోల్జర్స్ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. మూడు రోజుల నుంచి ఆమె ఆసుపత్రి బయట ఉన్నట్లు స్థానికులు తెలిపారు. నిన్న ఆరోగ్యం క్షీణించటంతో మృతి చెందిందన్నారు. విషయం ఆసుపత్రి సిబ్బందికి తెలపగా.. "ఆమె ఆసుపత్రిలో చేరలేదు.. కనీసం ఓపి కూడా రాయించుకోలేదు. కాబట్టి మాకు సంబంధం లేదు" అన్నారని చెప్పారు. దీంతో సమాచారం అందుకున్న హెల్పింగ్ సోల్జర్స్ ఫౌండర్ షేక్.ఇనాయి తుల్లా తమ కమిటీ సభ్యులతో అక్కడికి వచ్చి ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుతున్నారు.

ఇదీ చదవండీ.. వైద్యం ఖర్చులు భరించలేక.. కాలువలో దూకి కరోనా బాధితుని బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.