రోజుకో కొత్త ఆలోచనలతో సరికొత్త రుచులతో హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పాటవుతున్న వేళ... గుంటూరులోని ఓ ఫుడ్ కోర్టు నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించారు. ఆంధ్రా, రాయలసీమ రుచులనే కాదు... ఇండియన్, చైనీస్, మెక్సికన్ రుచుల్ని ఒకే చోట అందుబాటులోకి తెచ్చారు. వినియోగదారుల్ని ఆకర్షించేందుకు వాడిపడేసిన డ్రమ్ములు, పనికి రాని వాహనాల ముందు భాగాల్ని ఫర్నీచర్‌గా మార్చేశారు. అలాగే పరిసరాల్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. మారుతున్న నగరవాసుల అభిరుచుల మేరకు... కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. ఇపుడు గుంటూరు నగరంలో ఈ రెస్టారెంట్ ఓ హాట్ టాపిక్.
పనికిరాని వస్తువులే ఆ రెస్టారెంట్లో ఫర్నీచర్ - vechiles
గుంటూరులోని ఓ ఫుడ్ కోర్టు నగరవాసుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. అన్ని రకాల రుచులతో పాటు ఫర్నీచర్ కూడా కొత్త అనుభూతిని అందిస్తోంది. ఆయిల్ డ్రమ్ములు, వాహనాల ముందు భాగాలతో ఏర్పాటు చేసిన ఫర్నీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.