భారత్ బంద్‌కు అమరావతి రైతులు మద్దతు పలికారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెలగపూడి దీక్షా శిబిరం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. వెలగపూడి కూడలిలో మానవహారంగా ఏర్పడి.. జై జవాన్, జై కిసాన్ అని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి రైతు సమస్యలు పట్టట్లేదని.. తాను శంకుస్థాపన చేసిన ప్రాంతం నుంచి రాష్ట్ర రాజధానిని తరలిస్తుంటే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్రం కనీసం చర్చలు జరుపుతోందని.. తాము 357 రోజులుగా ఆందోళన చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం పిలిచి మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: పట్టుబట్టి సాధించిన మహిళలు...డిమాండ్లకు తలొగ్గిన పోలీసులు