కౌలు చెక్కులు విడుదల చేయాలంటూ గుంటూరు జిల్లాలోని తుళ్లూరులో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. దీక్షా శిబిరం నుంచి తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వరకు అమరావతి రైతులు ర్యాలీ చేశారు. అనంతరం సీఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాజధాని ప్రాంతంలో దాదాపు 20 శాతం మందికి కౌలు డబ్బులు రాలేదని రైతులు వాపోయారు. రైతుల ర్యాలీకి తెదేపా నేత శ్రావణ్ మద్దతు ప్రకటించి... ర్యాలీలో పాల్గొన్నారు.
అసైన్డ్ రైతులకు ఇచ్చే నెలవారీ పింఛన్ కూడా చెల్లించలేదని రైతులు మండిపడ్డారు.15 రోజుల్లో తమకు రావాల్సిన కౌలు, పింఛన్ ఇవ్వకపోతే విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతులు హెచ్చరిచారు.
ఇదీ చదవండి: TDP PROTEST: చెత్తపై యూజర్ ఛార్జీలను నిరసిస్తూ తెదేపా ఆందోళన