తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని రాజధాని అమరావతి ప్రాంత గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను అనుమతించింది.
విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు శుక్రవారం ఈమేరకు ఆదేశాలిచ్చారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని ప్రశ్నిస్తూ తుళ్లూరు గ్రామానికి చెందిన కొమ్మినేని కోటేశ్వరరావు మరో ముగ్గురు హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు.
ఇదీ చదవండి: